– ఇప్పటికీ సగం ధాన్యం కల్లాల్లోనే
– ఇబ్బందులు పడుతున్న రైతులు
నవతెలంగాణ -భువనగిరిరూరల్
ఏప్రిల్ 21న ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభించి నేటికీ 42 రోజులు అవుతున్న సగం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో యాసంగి సీజన్ లో 2 లక్షల 84 వేల ఎకరాలలో వారి సాగు చేయగా 5 లక్షల 97,000 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. దిగుబడిలో ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని అధికార యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకొని ఏప్రిల్ లో నెలలో ప్రారంభించి జూన్ లోగా పూర్తి చేయాలనుకున్నారు . ఇప్పటివరకు 2 లక్షల 96 వేల 661 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా 2 లక్షల 78,685 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించినట్లు తెలిపారు. ఇంకా 17,975 పెట్టి టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని మిల్లులకు తరలించాల్సిందన్నారు. ఇప్పటివరకు 31,766 మంది రైతులకు గాను 150 కోట్ల 76 లక్షల రూపాయలు చెల్లించినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 89 లక్షల 71వేల 885 గన్ని బ్యాగులను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
అకాల వర్షాలతో అన్నదాత కుదేలు…
జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలు నత్తనడకన నడుస్తుండడం లారీల కొలత కారణం తోడవడంతో ఇల్లులకు ధాన్యం సకాలంలో చేరడం లేదు. తేమ, తరుగు పేరుతో కిలో నుంచి 5 కిలోల వరకు రైస్ మిల్లర్లు కట్ చేస్తున్నారు. దీంతో రైతులు తీవ్ర ఆందోళనలు ఉన్నారు. మరొకవైపు అకాల వర్షంతో రైతులు వడ్లను ఆరబెట్టినప్పటికీ వరదల వలన కొంత నష్టం జరుగుతుంది. మళ్లీ వాటిని ఆరబెట్టాల్సి వస్తుంది. నెలల తరబడి రైతులు కొనుగోలు కేంద్రాలలోనే నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. జూన్ నెల ప్రారంభం కావడం తో ఋతుపవనాలు వచ్చినట్లయితే వర్షాలతో ఇబ్బందులు పడే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు.
రైతుల ఆందోళనలు…..
తరుగు పేరుతో 5 కిలోల ధాన్యాన్ని తగ్గించడానికి నిరసిస్తూ అనాజిపురం గ్రామ రైతులు భువనగిరి చిట్యాల రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. పోచంపల్లి మండలంలో కొనుగోలు కేంద్రంలో జాప్యం తరుగు పేరుతో ధాన్యం కట్ చేయడం నిరసిస్తూ ధర్నా చేశారు. బీబీనగర్ మండలం మాదారం గ్రామం చెందిన రైతులు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. రాజాపేట లో ధాన్యం కొనుగోలు కేంద్రంలో జాబితాన్ని నిరసిస్తూ తాసిల్దార్ వినతిపత్రం అందజేశారు.
జిల్లా వ్యాప్తంగా 324 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు
సివిల్ సప్లై మేనేజర్ గోపికృష్ణ
జిల్లా వ్యాప్తంగా వారి ధాన్యమును కొనుగోలు చేయడానికి 324 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఐకెపి ఆధ్వర్యంలో 86, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 228, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ (రైతు నిర్మిత సంస్థ) ఆధ్వర్యంలో 10 కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఇప్పటివరకు 22 కేంద్రాలలో పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేసి మూసివేశాం. 302 కేంద్రాలలో కొనుగోలు కొనసాగుతుంది. 75 శాతం కొనుగోలు చేశాం.
పది రోజులలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తి చేస్తాం
జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి…
324 ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఇప్పుడు వరకు 22 కొనుగోలు కేంద్రాల ను పూర్తిస్థాయిలో కొనుగోలు చేసి మూసివేశాం. వారం పది రోజులలో మిగతా 50 వేల మెట్రిక్‌టన్నుల ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేసి, ప్రక్రియను పూర్తి చేస్తాం. తెలిపారు. రైతులకు ఏమైనా ఇబ్బందులు తరలితే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.