నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని స్మైల్ ద స్కూల్లో ఫ్రీ హోలీ సెలబ్రేషన్స్ శనివారం హోలీ సెలబ్రేషన్ నిర్వహించినారు దీనికి అందరూ వైట్ డ్రెస్ వేసుకొని నేచురల్ కలర్స్ తో అందరూ ఘనంగా హోలీ జరుపుకున్నారు. చిన్నారుల ఒకరు ఒకరు ఒకరు రంగులు పూసుకుంటూ ఎంజాయ్ చేశారు. వివిధ సాంగ్స్ మ్యూజిక్ మీద డాన్సులు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ షబానా గౌహర్ ఉపాధ్యాయునులు సింధూర సవిత విమల సరిత స్వప్న సంతోషిని రోజా శ్రావణి సరిత ప్రసన్న సింధుజ రవళి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు .
జెంటిల్ కిడ్స్ పాఠశాలలో.. పట్టణంలో జెంటిల్ కిడ్స్ పాఠశాల యందు హోలీ పండుగ సంబరాలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల కరస్పాండెంట్ లయన్ గుజరాతి ప్రకాష్ మాట్లాడుతూ హోలీ పండుగ అతి ప్రాచీనమైన పండుగ అని ఈ పండుగను ఆడ మగ చిన్న పెద్ద వయోభేదం లేకుండా జరుపుకుని, మనిషిలోని చెడు ప్రవర్తనను అంతం చేసి మంచిని పెంచే పండుగని ఈ హోలీ పండుగ గొప్పదనాన్ని గురించి పిల్లలకు వివరించారు. ఈ హోలీ పండుగలో భాగంగా పిల్లలందరూ రంగులను ఒకరిపై ఒకరు చల్లుకొని ఆటపాటల నడుమ ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ లతా అధ్యాపక బృందం శాంతిని విద్యార్థులు పాల్గొన్నారు.