– నైసర్గిక విభాగాలు
– తెలంగాణ జాగ్రఫి
ఉనికి రీత్యా తెలంగాణ ప్రాంతం దక్షిణ భారతదేశంలోని దక్కన్ పీఠభూమిలో విస్తరించి ఉంది.
దక్కన్ పీఠభూమి అతిపురాతనమైనది. దక్కన్ పీఠభూమి అగ్ని, నీస్, సిస్ట్ శిలలతో ఏర్పడి ఉన్నది.
తెలంగాణ ఉనికి రీత్యా ఉన్న గోళార్థం – ఉత్తరార్ధగోళం.
తెలంగాణ ఉనికి రీత్యా ఉన్న ప్రాంతం – దక్షిణాసియా.
భౌతికంగా తెలంగాణ రాష్ట్రం, ద్వీపకల్ప భారతదేశంలోని పీఠభూమి భాగంలో ఉంది. ఈ రాష్ట్రం దక్కన్ పీఠభూమిలో భాగం కాగా, ఆ భాగాన్ని తెలంగాణ పీఠభూమిగా అభివర్ణిస్తారు.
సాధారణంగా ఎత్తు పడమర దిశనుంచి తూర్పు దిశ వైపుకు తగ్గుతున్నట్లు చూడవచ్చు. సముద్రమట్టం ఎత్తును ఆధారంగా చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని 3 ప్రాంతాలుగా విభజించవచ్చు. అవి:
ఎ. సముద్ర మట్టం నుంచి 600 మీ|| పైన ఎత్తుగల ప్రాంతం
బి. సముద్ర మట్టం నుంచి 300 మీ|| నుంచి 600 మీ|| ఎత్తు ప్రాంతం
సి. సముద్ర మట్టం నుంచి 300 మీ|| నుంచి తక్కువ ఎత్తు గల ప్రాంతం
ఎ. సముద్ర మట్టం నుంచి 600 మీ|| పైన ఎత్తుగల ప్రాంతం:
ఈ ప్రాంతం ప్రధానంగా రాష్ట్ర పశ్చిమ భాగంలో వ్యాపించి ఉంది. ఈ ప్రాంతం ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ – మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్ధిపేట దక్షిణ ప్రాంతంలో, నాగర్ కర్నూల్ ప్రాంతంలో వ్యాపించి ఉంది. ఈ ప్రాంతం ఎక్కువగా ఉపరితల మైదానాలతో ఉండి ఆర్చియన్ నీసిస్ శిలలపై అభివృద్ధి చెంది, చాలా గరుకుగా వెదజల్లిన రీతిలో ఉంటుంది. సాధారణంగా ఈ ప్రాంతపు వాలు తూర్పు దిశగా వాలి ఉంటుంది. ఈ ప్రాంతంలో కృష్ణా, గోదావరి ప్రధాన నదులు, వీటి ఉపనదులు తూర్పు వైపు ప్రవహిస్తాయి.
బి. సముద్ర మట్టం నుంచి 300 మీ|| నుంచి 600 మీ|| ఎత్తు ప్రాంతం:
ఈ ప్రాంతం (పడమరన) అధిక ఎత్తుగల ప్రాంతానికి (తూర్పున) లోతట్టు ప్రాంతానికి మధ్యభాగంలో ఉంటుంది. ఈ ప్రాంతం తెలంగాణ రాష్ట్రం పశ్చిమ భాగంలో ఉన్న వికారాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, కామారెడ్డి, వరంగల్ జిల్లాలలో వ్యాపించి ఉంది.
ఉత్తరాన గోండ్వాన బెల్టు భ్రంశం అనే ప్రక్రియతో గోదావరి తీరంలో భద్రపరచబడి ఉంది. దక్షిణాన, కృష్ణ, తుంగభద్ర లోయలు (Vaశ్రీశ్రీవy) 300 నుంచి 450 మీ|| ఎత్తులో ఉన్నాయి. ఈ ప్రాంతంలో నైస్ అంతర్గత శిలగా ఉండి, ఈ ప్రాంతం అంతటా నీటి వనరులతో ముఖ్యంగా సరస్సులతో, వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుంది.
సి. సముద్ర మట్టం నుంచి 300 మీ|| నుంచి తక్కువ ఎత్తు గల ప్రాంతం:
ఈ ప్రాంతం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ విస్తీర్ణం కలిగి గోదావరి నదికి ఇరువైపులా వ్యాపించి ఉంది. ఈ ప్రాంతం ప్రధానంగా విభజనకు పూర్వ జిల్లాలైన నల్గొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో వ్యాపించి ఉంది. ఈ ప్రాంతం వ్యవసాయ నికి అనుకూలంగా ఉంటుంది.
తెలంగాణకు మరొక పేరు రత్నగర్భ. తెలంగాణ రాష్ట్ర భూభాగం సమద్విబాహు త్రిభుజం ఆకారంలో ఉంటుంది. తెలంగాణ పురాతన గోండ్వానా ప్రాంతం నుంచి విడిపోయిన ద్వీపకల్ప భారతదేశంలో భాగంగా ఉన్నది.
రాష్ట్రంలోని 31 జిల్లాలు దక్కన్ పీఠభూమిలో భాగంగా ఉన్నాయి.
హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలు – గ్రానైట్ శిలలతో ఏర్పడిన టార్స్, బౌల్డర్స్ తదితర ఆకారాలతో ఏర్పడిన కొండలు, గుట్టలు విస్తరించి ఉన్నయి.
రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల మధ్య ప్రాంతం – బసాల్ట్ లావాతో ఏర్పడిన కోత మైదానాలు.
నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాలు – నీస్, గ్రానైట్ శిలలతో కూడి ఉన్నాయి..
నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల పెద్దపల్లి, జయశంకర్ – భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు గోదావరి నది లోయలో భాగంగా ఉండటం వలన పురాతన గోండ్వానా శిలలతో బొగ్గు నిక్షేపాలు ఏర్పడి ఉన్నాయి.
గోండ్వానా శిలలు తెలంగాణలో గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్నాయి.
తెలంగాణ ప్రాంతం సముద్రమట్టానికి 480 నుంచి 600 మీటర్ల ఎత్తులో ఉంది.
హైదరాబాద్ 600 మీటర్ల ఎత్తులో ఉంది. కృష్ణా – తుంగభద్ర నదిలోయల మధ్య ప్రాంతం 300-450 మీ.
భీమా – గోదావరి నదుల మధ్య ప్రాంతం (హైదరాబాద్, వరంగల్, ఖమ్మం మధ్య ప్రాంతం) – 730 మీటర్లు.
మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల మధ్య ప్రాంతం 600-900 మీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది.
దక్కన్ పీఠభూమి తూర్పున గల తూర్పు కనుమలు, దక్షిణానగల పశ్చి కనుమలు రెండు తెలంగాణలోకి ప్రవేశించాయి.
పశ్చిమ కనుమలను సహ్యాద్రి / సత్నాల పంక్తిగా పిలుస్తారు. తెలంగాణ ప్రాంతంలోకి పడమటి కనుమలు / సహ్యాద్రి పర్వతాలు అజంతా శ్రేణి నుంచి విడిపోయి ఆగేయ దిశగా ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశించాయి.
తూర్పు కనుమలు నిర్మాణం దృష్ట్యా తూర్పు కొండ లుగా మహబూబ్ నగర్ నుంచి తెలంగాణలోకి విస్తరించాయి.
తెలంగాణలో తూర్పు కనుమలు ఏక శ్రేణిగా ఉండ కుండా గుట్టలు, కొండలుగా ఉండి ప్రాంతీయ పేర్లతో పిలువబడుతున్నాయి.
తెలంగాణలో తూర్పు కనుమల్లో ఎత్తైన కొండ లక్ష్మీదేవిపల్లి కొండ. ఇది సిద్ధిపేట జిల్లాలో ఉంది.
తెలంగాణలో పశ్చిమ కనుమల్లో (నిర్మల్ జిల్లా) ఎత్తైన శ్రేణి – మహబూబ్ ఘాట్
నోట్: దక్కన్ పీఠభూమిలో ఎత్తైన ప్రాంతం – సోలామైల్ (జనగామ)
తెలంగాణ ప్రాంత నిర్మాణం, స్వరూపాన్ని బట్టి తెలంగాణ రాష్ట్రాన్ని 3 ప్రాంతాలుగా విభజించవచ్చు. అవి:
1) తెలంగాణ పీఠభూమి 2) గోదావరి బేసిన్ ప్రాంతం 3) కృష్ణాపర్వతపాద ప్రాంతం.
తెలంగాణ రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో ఇది సుమారు 59,968 చ.కి.మీ. విస్తరించి ఉంది.
ఈ ప్రాంతం తెలంగాణ రాష్ట్రం యొక్క అతిపెద్ద ప్రాంతంగా అభివర్ణిస్తారు.
సగటున ఈ ప్రాంతం ఎత్తు సముద్ర మట్టానికి 500 మీటర్ల నుంచి 600 మీటర్ల మధ్యలో ఉంటుంది.
ఈ ప్రాంతం వాలు తూర్పు దిశకు వాలి ఉంటుంది.
ఈ పీఠభూమి నిర్మల్ (బైంసా – నిర్మల్ పీఠభూమి), నిజామాబాద్, కామారెడ్డి, భువనగరి-రామన్నపేట పీఠభూమి, దేవరకొండ పీఠభూమి, నల్గొండ-మిర్యాల గూడ పీఠభూమి, సూర్యాపేట-హుజూర్‌నగర్ పీఠభూమి, మెదక్ సంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలలో వ్యాపించి ఉంది.
ఈ ప్రాంతం అంతా చిన్న కొండలు, గుట్టలు, ఎత్తు పల్లాల స్థలాకృతి కలిగి ఉంటుంది.
కొండలు, గుట్టలు, వాటి పేర్లు
నిర్మల్ పంక్తులు- నిర్మల్,
సత్నాల కొండలు – ఆదిలాబాద్
సిర్పూర్ కొండలు- కుమ్రం భీం ఆసిఫాబాద్
రాఖీ కొండలు – జగిత్యాల
రామగిరి కొండలు – పెద్దపల్లి
కందికల్ కొండలు – వరంగల్ అర్బన్
హన్మకొండ – వరంగల్ అర్బన్
పాండవుల గుట్టలు- జయశంకర్ భూపాలపల్లి
పాపి కొండలు – గోదావరి నది పాపికొండలను చీలుస్తూ ప్రవహిస్తుంది. యల్లండ్లపాడు గుట్టలు, రాజుగుట్టలు
నల్గొండ, యాదాద్రి-భువనగిరి జిల్లాలు:
యాదాద్రి గుట్టలు నాగార్జున కొండలు
భువనగిరి కొండలు నంది కొండలు
నల్లమల కొండలు – నాగర్ కర్నూల్
అమ్రాబాద్ కొండలు – నాగర్ కర్నూల్
షాబాద్ కొండలు – మహబూబ్‌నగన్
పాబాద్ కొండలు డిండి నదికి జన్మస్థలం
నల్లమల కొండలు కృష్ణా-పెన్నా నదుల మధ్య విస్తరించి ఉన్నాయి. వీటి సగటు ఎత్తు 520 మీటర్లు.
అనంతగిరి కొండలు వికారాబాద్ – వికారాబాద్
అనంతగిరి కొండలు మూసీ నదికి జన్మస్థలం. ఇది వికారాబాద్లోని శివారెడ్డిపేట వద్ద ఉంది. ఇది వన మూలికలకు ప్రసిద్ధి చెందింది. ఈ కొండల్లో అనంతపద్మనాభస్వామి దేవాలయం ఉంది.
గోలకొండ, రాచకొండ
దాచకొండ దక్షిణ-తూర్పు దిశలో నల్లగొండ జిల్లా దేవరకొండ తాలూకా వరకు, పశ్చిమ దిశలో వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల వరకు, దక్షిణ దిశలో మహబూబ్‌నగర్ జిల్లా షాబాద్ కొండల వరకు విస్తరించి ఉంది.
నోట్: హైదరాబాద్ – మహబూబ్‌నగర్ జిల్లాల్లో వ్యాపించిన కొండలు బాలాఘాట్ పర్వతాలకు చెందినవి.
ెమెదక్, సిద్ధిపేట జిల్లాలు:
బూజు గుట్టలు లక్ష్మీదేవునిపల్లి కొండలు.
ెనిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు:
సిర్నాపల్లి కొండలు, రాతికొండలు
గోండ్వానా శిలలు
– రాష్ట్రంలో గోండ్వానా శిలలు గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్నాయి.
– గోండ్వానా శిలల్లో ప్రధాన ఖనిజం – నేలబొగ్గు
– రాష్ట్రంలో నేలబొగ్గును వెలికితీసే సంస్థ – సింగరేణి.