ఆదిత్య ఓం నటిస్తున్న ‘బంది’ సినిమాని గల్లీ సినిమా బ్యానర్ మీద వెంకటేశ్వర రావు దగ్గు, తిరుమల రఘు నిర్మిస్తుండగా.. తిరుమల రఘు దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. దర్శక, నిర్మాత రఘు తిరుమల మాట్లాడుతూ, ‘ఇది నాకు మొదటి చిత్రం. ఆదిత్య ఓం సపోర్ట్ వల్లే ఈ మూవీని చేయగలిగాను. సినిమాలో కేవలం ఒక్క క్యారెక్టరే ఉంటుంది. ఆదిత్య వర్మ అనే పాత్రతోనే ఈ మూవీ ఉంటుంది. ప్రకృతిని నాశనం చేస్తున్న కార్పోరేట్ కంపెనీలకు సపోర్ట్ చేసే పాత్రలో ఆదిత్య కనిపిస్తారు. అలాంటి లీగల్ అడ్వైజర్ పాత్రని అడవిలో వదిలేస్తే ఏం జరుగుతుంది? అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ప్రకృతిని ఎలా కాపాడుతాడు? అనేది చివరకు చూస్తారు’ అని అన్నారు.