ప్రకృతి క్షేత్రం

”అమ్మా నేనెవరికి పుట్టాను?”
”నేను వేశ్యను నాయనా”
”మళ్ళీ అడుగుతున్నా;
నా తండ్రి ఎవరు?”
”ఎలా చెప్పగలను తండ్రీ…
ఆకలి నా అవసరం
మృగకామం వాడి అవసరం
అవసరానికి కులం ఏమిటి?
మతం ఏమిటి?
అవసరం అవసరమే
ఏ రేణువు కారణమో
ఎలా చెప్పగలను తండ్రీ.!”
”భయపడకమ్మా
నేను పరశురాముడ్ని కాను
ఈ కాలపు కొడుకును
కడవరకు నిన్ను కాసుకుంటా..
నవ మాసాలు మోసావు
పాలిచ్చి పెంచావు
ఈ జన్మకు జీవితానికి
సాక్షిగా నన్ను నిలిపావు”
”ధన్యుడిని తండ్రీ
గుర్తించావు
ఆకలికి కామానికి
తండ్రి గొడవెందుకు నాయనా?
మళ్ళీ మళ్ళీ చెబుతున్నా…
నీ జన్మ స్థానం
కుల మతాతీతమైన
ప్రకృతి క్షేత్రం.
తల్లి వాస్తవం
తండ్రి నమ్మకం
జన్మ జన్మల రహస్యం
ఇదేకద నాయనా..!”
-కె. శాంతారావు
9959745723