పల్లెలను పచ్చదనంగా మార్చాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పరిరక్షించాలని దాంతో ప్రకృతి రమణీయంగా మారుతుందని మండల ప్రత్యేక అధికారులు నాగమణి, సురేష్ కుమార్ నాయుడు అన్నారు. శుక్రవారం మండలంలోని కొండూరు గ్రామంలో పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి మొక్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ..పచ్చదనం పచ్చదనం కార్యక్రమంతో గ్రామాలకు కొత్తశోభను తీసుకువస్తుంది అన్నారు. అందులో ఏపుగా పెరిగిన వివిధ రకాల మొక్కలు చూపరులకు కనువిందు చేస్తాయి అన్నారు. పచ్చదనం, ఆహ్లాదంతో ప్రజలను ఆకట్టుకుంటాయి అని పేర్కొన్నారు. రకరకాల పూలు, పండ్లు, నీడనిచ్చే చెట్లతో గ్రామాలు పచ్చని ప్రకృతితో పరిడవిల్లి గ్రామస్తులకు ఆనందం.. ఆహ్లాదం పంచుతయి అని వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలి అన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ కిషన్, ఎంపీఓ కూచన ప్రకాష్, ఏపీఓ కుమార్ గౌడ్, పంచాయతీ కార్యదర్శులు రాజు, మహేందర్, అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు.