ప్రకృతి చెప్తుంది

ఆకు రాలుతూ చెప్తుంది..
ఈ జీవితం శాశ్వతం కాదని
పువ్వు వికసిస్తూ చెప్తుంది..
జీవించేది ఒక్క రోజైన గౌరవంగా జీవించమని
మేఘం వర్షిస్తూ చెప్తుంది..
చేదును గ్రహిస్తూ మంచిని పంచమని
మెరుపు మెరుస్తూ చెప్తుంది..
ఉండేది ఒక్క క్షణమైనా ఉజ్వలంగా ఉండమని
కొవ్వొత్తి కరిగిపోతూ చెప్తుంది..
చివరి క్షణం వరకు పరులకు సాయపడమని
వృక్షం చల్లని నీడనిస్తూ చెప్తుంది..
తను కష్టాల్లో ఉన్నా ఇతరులకు సుఖాన్ని ఇవ్వాలని
ఏరు జలజలా పారుతూ చెప్తుంది..
తనలాగే కష్ట సుఖాల్లో చలించకుండా సాగమని
జాబిల్లి వెలుగుతూ చెప్తుంది..
తనలాగే ఎదుటి వారిలో వెలుగులు నింపమని.
– పొన్నం రవిచంద్ర, 9440077499