బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌లను రిలీజ్ చేసిన తర్వాత ‘భైరవం’ మేకర్స్ తాజాగా ఫీమేల్ లీడ్ పాత్రలపై దష్టి పెట్టారు. విజరు కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కెకె రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతిలాల్ గదా సమర్పిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే స్ట్రాంగ్ బజ్‌ని క్రియేట్ చేసింది. డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ ఈ సినిమాతో టాలీవుడ్‌లో అరంగేట్రం చేస్తున్నారు. ఇందులో ఆమె బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన నటిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా ఆమెను అల్లరి పిల్ల వెన్నెలగా మేకర్స్ పరిచయం చేశారు. ‘భిన్న కాన్సెప్ట్‌తో రూపొందుతున్న చిత్రమిది. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుంది’ అని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే- దర్శకత్వం: విజరు కనకమేడల, నిర్మాత: కె.కె.రాధామోహన్, సమర్పణ: డా.జయంతిలాల్ గడ (పెన్ స్టూడియోస్), సినిమాటోగ్రాఫర్: హరి కె వేదాంతం, ప్రొడక్షన్ డిజైనర్: బ్రహ్మ కడలి, ఎడిటర్: చోటా కె ప్రసాద్, సంగీతం: శ్రీ చరణ్ పాకాల, డైలాగ్స్: సత్యర్షి, తూమ్ వెంకట్.