నవతెలంగాణ క్యాలెండర్స ఆవిష్కరణ చేసిన ఈఈ

Nav Telangana calendars were invented by EEనవతెలంగాణ – ఓయూ
సికింద్రాబాద్ సర్కిల్ 29 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ( ఈఈ ), భావరాజు.వెంకట సూర్య పేరాజు  తన కార్యాలయంలో నవ తెలంగాణ నూతన సంవత్సర 2025 క్యాలెండర్స్ ను నవతెలంగాణ సీనియర్ రిపోర్టర్, ఓయూ పరిశోధన విద్యార్థి తలారి.శ్రీనివాసరావు తో కలిసి మంగళవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. సర్కిల్ ను జోనల్ కమీషనర్ , డీసీ ల ఆదేశాలు అమలు చేస్తు తమ పరిధిలో అభివృద్ధి కి కృషి చేస్తానని చెప్పారు. మా డిప్యూటీ ఇంజనీర్స్ ( డీఈ ), అసిస్టెంట్ ఇంజినీర్స్ ( ఎఈ ) లు, ఉద్యోగులు,తమ ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది నిత్యం అప్రమత్తంగా ఉంటు సేవాలు అందిస్తున్నట్లు చెప్పారు.పై అధికారులకు, ఉద్యోగులకు,సిబ్బందికి, సర్కిల్ స్థానికులకు,నవ తెలంగాణ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర  శుభాకాంక్షలు తెలియజేశారు.