
నవతెలంగాణ -తాడ్వాయి
పదకొండు దాటిన పత్తాలేరు.. తీరు మారేది ఎన్నడో, తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఏజెన్సీ రోగులు, పలుమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోని సంబంధిత అధికారులు అనే శీర్షిక నిన్న మంగళవారం నవతెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన విషయం విధితమే. ఉన్నతాధికారుల ఆదేశాల మేరికం డిప్యూటీ డిఎం హెచ్ ఓ, కోరం క్రాంతి బుధవారం కొడిశల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రికార్డులు, హాజరు పట్టిక ను పరిశీలించారు. ల్యాబ్, ఫార్మసీని సందర్శించారు. విధులకు డుమ్మా కొడుతున్న వైద్యుడు, ల్యాబ్ టెక్నీషియన్, మరో సిబ్బంది తో కలిపి ముగ్గురికి మెమోలు జారీ చేశారు. సందర్భంగా డిప్యూటీ డిఎంహెచ్వో కోరం క్రాంతి కుమార్ మాట్లాడుతూ ఏజెన్సీ లోని మారుమూల ప్రాంతం లో వైద్య సిబ్బంది సమయపాలన పాటిస్తూ మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. వైద్యం కోసం వచ్చే రోగుల పై చిరాకు చూపించొద్దని చెప్పారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గర్భిణీలు పి హెచ్ సి ల్లోనే ప్రసవయ్యేలా చూడాలని తెలిపారు. ఇంకోసారి విధులకు డుమ్మా కొడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.