
నవతెలంగాణ – డిచ్ పల్లి:
ప్రజా సమస్యలు వేలికి తీయడంలో నవ తెలంగాణ ముందు వరుసలో ఉంటుందని, విజయవంతంగా 9వ వార్షికోత్సవం జరుపుకుంటున్న నవతెలంగాణ పత్రిక యజమాన్యానికి, విలేకరులకు, సిబ్బందికి, ప్రత్యేక కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలుపుతున్నానని నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల ఐడిసిఎంఎస్ చైర్మన్ సాంబార్ మోహన్ అన్నారు.ఈ సందర్భంగా నవ తెలంగాణతో సాంబార్ మోహన్ మాట్లాడుతూ అనుక్షణం ప్రజల పక్షం ఉంటూనే ప్రజలు ఎదుర్కొంటున్న ఏ సమస్య అయినా వేలికి తీసి వాస్తవాలను ఉన్నది ఉన్నట్టుగా పత్రికల్లో ప్రచురించి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తుందన్నారు.తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని అయా రాష్ట్రలలో కూడా నవతెలంగాణ పత్రిక ఉండాలని ప్రసిద్ధి చెందలని ఆకాంక్షిస్తున్నాట్లు పేర్కొన్నారు.ఎప్పటి కప్పుడు సమస్యలను వార్త లో రూపంలో, ఆర్టికల్ లలో ప్రతి సమస్యలను వెలికి తియడం నవతెలంగాణ కే సాధ్యమన్నారు.రాబోవు రోజుల్లో పత్రిక మరింత రటు రాటు దేరుతూ ఎల్లవేళలా ప్రజాపక్షం ఉంటూనే ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు సాంబార్ మోహన్ వివరించారు