నవతెలంగాణ – డిచ్ పల్లి
ఎక్కడైనా ఎమైనా సమస్యలు ఉంటే నవతెలంగాణ వేలికి తీయడంలో ముందుంటుందని, రాబోవు రోజుల్లో నవతెలంగాణ ప్రజలకు మరింత చేరువ కావాలని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం, అదికారుల దృష్టికి తీసుకొచ్చి వాటిని పరిష్కరించే విధంగా చొరవ తనవంతు పాత్ర పోషించాలని ఇందల్ వాయి ఫారెస్ట్ రేంజ్ అధికారి రవి మోహన్ భట్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాములు నాయక్ అన్నారు. బుదవారం ఇందల్ వాయి ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలో నవతెలంగాణ దినపత్రిక 2024వ సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నవతెలంగాణ లో వచ్చే వార్తలు, విశ్లేషణలు ఎంతో స్పూర్తి దాయకంగా ఉంటాయని, ఎవరి పక్షాన ఉండకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించడం అబినందన మన్నారు.మరింత ప్రజా సమస్యలు వేలికి తిసి ప్రజలకు,అదికారుల వారధిగా ఉంటూ మన్ననలు పొందాలని సూచించారు. ఈఅవిష్కరణ కార్యక్రమం లో డిప్యూటీ రేంజ్ అధికారి ఎ శ్రీనివాస్,డిచ్ పల్లి,ఇందల్ వాయి నవ తెలంగాణ విలేకరి సయ్యద్ నయీమోద్దీన్, బీట్ అదికారులు తదితరులు పాల్గొన్నారు.