నవతెలంగాణ- మద్నూర్
రాష్ట్రంలో జుక్కల్ నియోజకవర్గం లో ముఖ్యంగా మద్నూర్ మండలంలో ప్రజా సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకురావడంలో నవ తెలంగాణ దినపత్రిక దిట్ట అని జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు పేర్కొన్నారు. నవతెలంగాణ 2025 నూతన సంవత్సర క్యాలెండర్లను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వానికి వారధిగా ఎప్పటికప్పుడు తీసుకురావడంలో నవతెలంగాణ దినపత్రిక దిట్ట అని తెలిపారు. నవతెలంగాణ దినపత్రికలో జనవరి పేజీతో పాటు జనవరి బాక్సులో యాడ్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు సంతోష్ మేస్త్రి దిగంబరావు లను ఎమ్మెల్యే అభినందించారు. నవతెలంగాణ దినపత్రిక క్యాలెండరు ఆవిష్కరణ జుక్కల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సాయి పటేల్ మద్నూర్ మండల మార్కెట్ కమిటీ చైర్మన్ కుటుంబ సభ్యులు సౌజన్య రమేష్ వైస్ చైర్మన్ పరమేశ్ పటేల్ బిచ్కుంద మండల నాయకులు పుల్కల్ వెంకటరావు మాజీ జెడ్పిటిసి నాగ్నాథ్ జుక్కల్ మండల నాయకులు రమేష్ దేశాయ్ సాయ గౌడ్ మద్నూర్ మండలం ముఖ్య నాయకులు విట్టల్ గురుజి హనుమాన్లు స్వామి సంతోష్ మేస్త్రి దిగంబరావ్ సచిన్ అమూల్ సురేష్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.