ఈ ప్రాంత అభివృద్ధికి నవతెలంగాణ తోడ్పడాలి: గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి 

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 

హుస్నాబాద్ ప్రాంతంలోని దీర్ఘకాలిక సమస్యలను గుర్తిస్తూ ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చి ఈ ప్రాంతా అభివృద్ధికి నవతెలంగాణ పత్రిక తోడ్పడాలని జిల్లా గ్రంధాలయ చైర్మన్ కేడం లింగమూర్తి అన్నారు. శుక్రవారం హుస్నాబాద్ లో నవతెలంగాణ క్యాలెండర్ ను నవతెలంగాణ రిపోర్టర్ సంపత్ ఆధ్వర్యంలో  జిల్లా గ్రంధాలయ చైర్మన్ కేడం లింగమూర్తి చేతుల మీదుగా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా సమస్యల పై నవతెలంగాణ పత్రిక ప్రజా ప్రతినిధిగా పని చేయాలని అన్నారు. నవతెలంగాణ ప్రజల పక్షాన ఉండి పనిచేయాలని తెలిపారు. నవ తెలంగాణ పాఠకులకు, ప్రజలకు నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.