రెండవ సెమిస్టర్ ఫలితాలలో నవభారత్ ప్రభంజనం

 నవతెలంగాణ – భువనగిరి
 మహాత్మా గాంధీ యూనివర్సిటీ ప్రకటించిన డిగ్రీ రెండవ సెమిస్టర్ ఫలితాలలో భువనగిరిలో ఉన్న శ్రీ నవభారత్ డిగ్రీ పిజి కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు  పీజీ కళాశాలల విద్యార్థులు నలుగురు పదికి పది ఎస్ జి పి ఏలు సాధించి యూనివర్సిటీ స్థాయి టాప్ వన్ గా నిలిచారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ చిక్క ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ బీకాం సి ఏ లో బండ శ్రీ వల్లిక, భూషమైన శివనందిని, హమీన్ సుమాయ, సబీనా మీద, పదికి పది సాధించినట్లు తెలిపారు, కండల్లోజు వెన్నెల 9.8,ఎల్ హారిక 9.8,,ను గురు సోనియా 9.8, ఆవుల ప్రశాంతిక 9.68, బర్మా అనూష 9.68, బత్తిని భార్గవి 9. 68, కావడి కృప 9.68 బి ఎస్ సి బి జెడ్ సి లో సాధించినట్లు తెలిపారు. 9.50 ఎస్ జి పి ఏ కు 31 మంది, 9 ఎస్ జి పి ఏ కు పైగా 75 మంది విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు పలితాలు రావడానికి కృషి చేసిన కళాశాల చైర్మన్ డాక్టర్ వి సుకుమార్ రెడ్డి ప్రిన్సిపాల్ చిక్కా ప్రభాకర్లు అభినందనలు తెలిపారు.