
మండలంలోని కటికనపల్లి గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు కరీంనగర్ కు చెందిన ఎన్నారై ముక్కా నవీన్ 40 మంది విద్యార్థుల కొరకు సుమారు పదకొండు వేల రూపాయల విలువైన నోటు పుస్తకాలను విరాళంగా పంపించగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సురకంటి ప్రభాకర్ రెడ్డి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ తమ పాఠశాల పేద విద్యార్థుల అవసరం కొరకు తన చిన్ననాటి మిత్రుడైన ఎన్నారై నవీన్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన పెద్ద మనసుతో వెంటనే స్పందించి నోటు పుస్తకాలు పంపించగా మంగళవారం ఉదయం పాఠశాల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఎ. మల్లేశం చేతులమీదుగా పంపిణీ చేయటం జరిగిందని అన్నారు ఈ సందర్బంగా మల్లేశం మాట్లాడుతూ విద్యార్థులకు దాతలు ఈ విధంగా సహకారం అందించటం గొప్పవిషయమని ప్రశంశించారు.తమకు నోటు పుస్తకాలు పంపించిన ఎన్నారై నవీన్ కు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్ పర్సన్ రామడుగు భాగ్యలక్ష్మి, ఉపాధ్యాయులు నూతి మల్లయ్య,నిమ్మల రేవతి, పొన్నం సంధ్య, క్లస్టర్ రిసోర్స్ పర్సన్ – బట్టు కుమార స్వామి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.