నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
(2023 -24) విద్యా సంవత్సరం పదో తరగతి పరీక్ష ఫలితాల్లో నవజ్యోతి పాఠశాల విద్యార్థులు ప్రభంజన ఫలితాలు సృష్టించి కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికే తలమానికంగా నిలిచారని పాఠశాల చైర్మెన్ కరస్పాండెంట్ మలిరెడ్డి ఇందిరా రవీందర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు శనివారం నవతెలంగాణతో మాట్లాడారు. విద్యార్థుల తల్లిదండ్రుల మన్ననలతో తమ పాఠశాల దినదిన ప్రవర్తమానంగా ఎదుగుతుందన్నారు. క్రమశిక్షణకు, నాణ్యమైన చదువుకు మారుపేరుగా తమ పాఠశాల ఈ ప్రాంతంలోనే ప్రత్యేకత సాధించిందన్నారు. రంగారెడ్డినగర్ డివిజన్ వైఎంఎస్ కాలనీలోని పట్వారినగర్, ఆదర్శనగర్ బ్రాంచీల విద్యార్థులు గత నాలుగు దశాబ్దాలుగా అనుభవజ్ఞులైన అధ్యా పకులతో విద్యా ర్థుల మనోభావాల కు అనుగుణంగా విద్యా బుద్ధులు నేర్పుతూ వారి ఉజ్వల భవిత పునాదులు వేస్తున్నా మన్నారు. ఎంతో మంది తమ పాఠశాలలో విద్యార్థులు విదేశాలతో పాటు, ఉన్నత ఉద్యోగాల్లో రాణిస్తున్నారని తెలిపారు. విద్య విషయంలో ఎక్కడ రాజీ పడకుండా పాఠశాలనే దేవాలయంగా భావిస్తూ విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దుతున్నా మన్నారు. ప్రతి సంవత్సరం పదో తరగతిలో ఈ ప్రాంతంలోనే అసాధారణ ఫలితాలు సష్టిస్తున్నామన్నారు. అనంతరం ఈ సంవత్సరం పదో తరగతిలో జీపీఏ. 10.10 సాధించిన (14) మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున నగదు పారితోషికం అందజేశారు. జపీఏ 9.8సాధించిన (11)మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.2వేల చొప్పున నగదు బహుమతులు యాజమాన్యం తో కలిసి ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ చేతులమీదుగా అందజేశామని తెలిపారు. మొత్తం 252 మంది విద్యార్థు లు పరీక్షకు హాజరు కాగా జీపీఏ.10/10. 14 మంది, జీపీఏ 9.8.(11)మంది, జీపీఏ. 9.0 (108) మంది విద్యార్థులు అరుదైన ఫలితాలు సాధించి 99.2శాతంతో ఈ ప్రాంతానికే నవజ్యోతి విద్యార్థులు విజయ దుందుభి మోగించి తలమానికంగా నిలిచారు. ప్రస్తుతం రెండు బ్రాంచీలలో 2,5 వందలపై చిలుకు విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు ఆదిత్య కృష్ణారెడ్డి,బి. రూపాంజలి, టీచర్లు పాల్గొన్నారు.
విశాలమైన గదులు,చక్కటి ఆటస్థలం
విద్యార్థులకు విద్యతోపాటు పలు క్రీడల్లో శిక్షణ ఇచ్చే విధంగా పాఠశాల ప్రాంగణంలో సువిశాలమైన ఆటస్థలం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కేజీ నుండి పదో తరగతి చదువుతున్న ప్రతి విద్యార్థులు సెక్షన్లలో పరిశుభ్రంగా ఉంచడంతోపాటు పాఠశాల ప్రాంగణంలో చెట్లు పెంచామన్నారు. విద్యార్థులు చదువులకే పరిమితం కాకుండా వారిలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి ఎస్.ఏ రైటింగ్‌లతో పాటు సైన్స్ ఫెయిర్ వంటి ప్రదర్శనలను ఏర్పాటు చేసి ప్రోత్సహిస్తున్నా మన్నారు. ఆధ్యాత్మిక ప్రాంతాలతో పాటు పర్యాటక స్థలాలు, జూ, ఓషన్ పార్క్, మౌంట్ ఒపేరా వంటి ఇదే కాకుండా విహారయాత్రలు తీసుకెళుతున్నామన్నారు.