
నిజంసాగర్ మండల కేంద్రంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2024-25 సంవత్సరానికి సంబంధించి ఆరో తరగతి ప్రవేశాలకు జనవరి 20న ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఆ ఫలితాలను ఆదివారం విడుదల చేస్తున్నట్లు ప్రిన్సిపాల్ సత్యవతి ఒక ప్రకటనలో తెలిపారు. ఫలితాలకు సంబంధించి https://cbseit.in/cbse/2024/ NVS_RST/Result.aspx లింకుపై క్లిక్ చేసి అడ్మిట్ కార్డు నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ వివరాలు ఇచ్చి ఫలితాలు చూసుకోవచ్చని ఆమె తెలిపారు.