సిరిసిల్లలో నవోదయ అర్హత పరీక్ష 

నవతెలంగాణ – సిరిసిల్ల
జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరవ తరగతిలో 2025 – 26 సంవత్సరమునకు ప్రవేశం కు సంబంధించి అర్హత పరీక్ష శనివారం సిరిసిల్లలో నిర్వహించారు. జిల్లాలో ఐదు పరీక్ష కేంద్రాల్లో ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 1: 30 నిమిషాల వరకు ప్రశాంతంగా జరిగింది. జిల్లా నుండి 954 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా 740 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 214 మంది విద్యార్థులు గైర్హాజరు అయినారు. హాజరు శాతం 77.5% గా నమోదయింది. జిల్లాను రెండు బ్లాకులుగా విభజించి సిరిసిల్ల బ్లాక్ లో మూడు పరీక్ష కేంద్రాలు, వేములవాడ బ్లాక్ లో రెండు పరీక్ష కేంద్రాలు  జిల్లా వ్యాప్తంగా ఐదు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ప్రతి పరీక్ష కేంద్రానికి ఒక చీఫ్ సూపరిండెంట్ మరియు ఒక సి ఎల్ వోను నియమించారు. ప్రతి బ్లాకుకు  ఒక బి ఎల్ ఓ ను నియమించడం జరిగింది. ప్రభుత్వ ఉన్నత పాఠశాల, వేములవాడ  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, వేములవాడ (బాలికలు) పరీక్షా కేంద్రాలను  ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగిందని జిల్లాలో నవోదయ పరీక్ష ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందని జిల్లా విద్యాధికారి  బి జగన్మోహన్ రెడ్డి  తెలిపారు.