నవోదయ ప్రవేశ పరీక్ష  దరఖాస్తులు 23 వరకు పొడిగింపు

Navodaya Entrance Test applications extended till 23rdనవతెలంగాణ – పెద్దవూర
నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం చలకుర్తి క్యాంపు నందు ఉన్న జవహర్ నవోదయ విద్యాలయంలో 2025- 26విద్యా సంవత్సరానికి గాను ఆరవ తరగతిలో ప్రవేశము కొరకు ప్రవేశ ఎంపిక పరీక్షకు హాజరయ్యేందుకు ఆన్ లైన్లో దరఖాస్తు  గడువును పరిపాలనా కారణాల రీత్యా  ఈనెల 23 వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రిన్సిపాల్ ఆర్ నాగభూషణం సోమవారం తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రభుత్వ, లేదా గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల్లో ప్రస్తుతం ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్  కోరారు. నవోదయలో ఆరవ తరగతి ప్రవేశం కోరేటటువంటి అభ్యర్థులు ప్రస్తుతం ఐదో తరగతి (2024-25)ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే చదువుతూ వుండి, అభ్యర్థుల తల్లిదండ్రుల నివాసము ఉమ్మడి నల్గొండ జిల్లాలోనిదై ఉండాలని ఆయన అన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఏదైనా  ఇంటర్నెట్ సెంటర్ ద్వారా లేదా మొబైల్ ఫోన్ ద్వారా ఆన్ లైన్ లో ఉచితంగానే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు గాను  ప్రధానోపాధ్యాయుడి సంతకంతో కూడిన ద్రువపత్రం,ఫోటోతో దరఖాస్తును ఆన్లైన్లో సమర్పించవచ్చని తెలిపారు.