నిజామాబాద్ నగరానికి చెందిన నరాల నిహార్ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. బుధవారం రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఈ మేరకు ఫలితాలు విడుదల చేసింది. నగరానికి చెందిన నిహార్ మొన్నటి వరకు యూత్ కాంగ్రెస్ జాతీయ కోఆర్డినేటర్ గా పని చేశారు. సోషల్ మీడియా విభాగానికి ఇంచార్జిగానూ వ్యవహరించారు. నిజామాబాద్ కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత నరాల రత్నాకర్ తనయుడే నరాల నిహార్. తనకు ఓట్లు వేసి యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గెలిపించిన యూత్ కాంగ్రెస్ సభ్యులకు, నాయకులకు నిహార్ ధన్యవాదాలు తెలిపారు.