– వినాయకుడి మండపాల దగ్గర అన్నదానం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణ
నవతెలంగాణ-గండిపేట్
జైజై గణేశా.. జై బోలో గణేశా అంటూ నవరాత్రి ఉత్సవాలను ప్రజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం నార్సింగి, బండ్లగూడ, మణికొండ మున్సిపాలిటీల్లో గణనాథుడి పూజల్లో పలువురు నాయకులు పాల్గొని ప్రత్యేకంగా పూజలు చేశారు. మండపాల వద్ద చిన్నారులు ఆడిపడారు. వినాయకుడి మండపాల వద్ద ప్రజలకు నిర్వహకులు అన్నదానం నిర్వహించారు. బండ్లగూడలో ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కిస్మత్‌పూర్, హైదర్షాకోట్, నార్సింగి, బండ్లగూడ మున్సిపాలిటీలో మైలార్‌దేవపల్లి డివిజన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అడిపాడిన చిన్నారులకు జ్ఞాపికలను అందజేశారు. మణికొండ మున్సిపలిటీలో వైస్ ఛైర్మెన్ నరేందర్‌రెడ్డి అన్నదానం నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బండ్లగూడ కార్పొరేషన్ మొదటి వార్డు కార్పొరేటర్ తలారి చంద్రశేఖర్ సమక్షంలో మేయర్ మహేందర్ గౌడ్ శ్రీనివాస్ నగర్ కాలనీల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మణికొండ మున్సిపలిటీ నేక్నాంపూర్‌లోని అనంద్ పూర్తి గేటేడ్ కమ్యూనీటిల్లో నిమజ్జనం ముగింపు రోజున లడ్డూ వేలం పాట నిర్వహించారు. నార్సింగి మార్కేట్ కమిటీ మాజీ డైరెక్టర్ నిలేష్ ప్రసాద్ దూబె లక్ష 71 వేలకు లడ్డూను కైవసం చేసుకున్నారు. కార్యక్రమంలో మేయర్ మహేందర్ గౌడ్, బీఆర్‌ఎస్ నాయకుడు సురేష్ గౌడ్, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, కౌన్సిలర్లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.