నవతెలంగాణ- చివ్వేంల: శక్తిని అమ్మవారి రూపంలో కొలిచే నవరాత్రి ఉత్సవాలు మండల వ్యాప్తంగా ఘనంగా మొదలయ్యాయి. మండల పరిధిలోని అక్కల దేవి గూడెం గ్రామంలో కొలువై ఉన్న దుగ్గి దేవి ఆలయంలో దసర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి తొమ్మిది రోజుల పాటు కనక దుర్గమ్మ ఆలయంలో దేవి నవరాత్రులు వైభవంగా జరగనున్నాయి. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో దుర్గమ్మవారు పది అలంకారాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.ఈ కార్యక్రమం లో భక్తులు, తదితరులు పాల్గొన్నారు.