నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి

నవతెలంగాణ-దేవరకొండ
గణేష్‌ నవరాత్రి ఉత్సవాలను, నిమజ్జనం ప్రశాంతంగా జరుపుకోవాలని ఆర్డిఓ శ్రీరాములు, డీఎస్పీ గిరిబాబు తెలిపారు. మంగళవారం స్థానిక పురపాలక సంఘం కార్యాలయంలో చైర్మన్‌ ఆలంపల్లి నరసింహ అధ్యక్షతన జరిగిన శాంతి కమిటీ సమావేశంలో పాల్గొని వారు మాట్లాడారు. వినాయక విగ్రహాల స్థాపన నిర్వాహకులు తమ మండపాల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులకు సహకరించాలన్నారు. ఈ సమావేశంలో తాసిల్దార్‌ సంతోష్‌ కిరణ్‌, కమిషనర్‌ వెంకటయ్య, సిఐ నాగభూషణరావు ,మున్సిపల్‌ ఏఈ రాజు, మండపాల నిర్వహకులు, మత పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.