నవతెలంగాణ ఎఫెక్ట్..

Navtelangana effect..– 407 మందికి కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులు పంపిణీ
నవతెలంగాణ – సూర్యాపేట
ఆ రెండు నియోజకవర్గాలపై కపట ప్రేమ అనే వార్తకు స్పందించిన కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ మహిళలకు చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ లో మాజీమంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కాగా కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ క్రింద చెక్కులు పంపిణీ చేశారు.ఈ నెల 20 వ తేదీన నవ తెలంగాణ దిన పత్రిక లో ఆ రెండు నియోజకవర్గాలపై కపట ప్రెమ వార్తలో  నియోజకవర్గ పరిధిలో దాదాపుగా 400 మందికి పైగా కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ క్రింద చెక్కులు పంపిణీ చేయాల్సి ఉన్న కూడా ఆ కార్యక్రమం కూడా ముందుకు పడడం లేదని వార్త వచ్చిన విషయం తెల్సిందే.దీంతో అధికారులు స్పందించి హుటాహుటిన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తో మాట్లాడి కలెక్టరేట్ లో చెక్కులు పంపిణీ కార్యక్రమం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఏదైమైనప్పటికి  గత కొన్ని నెలలుగా నిలిచిపోయిన చెక్కుల పంపిణీ కార్యక్రమం  జరగడంతో మహిళలు హర్షం వ్యక్తం చేశారు.