నవతెలంగాణ ఎఫెక్ట్..

Navtelangana effect..– మత్తు పదార్థాలపై ఎక్సైజ్ శాఖ ముమ్మర తనిఖీలు..
నవతెలంగాణ – భిక్కనూర్
“కూల్ గా మత్తు పదార్థాల దంద” అనే శీర్షికను సోమవారం నాడు నవతెలంగాణ దినపత్రికలో ప్రచురించిన విషయం తెలిసిందే. కథనానికి స్పందించిన ఎక్సైజ్ శాఖ అధికారులు బుధవారం భిక్కనూరు మండలంలో ఎక్సైజ్ సీఐ మధుసూదన్ రావు, ఎస్సై దీపిక ఆధ్వర్యంలో టీ షాప్, పాన్ కోకాలను ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. గుట్టు చప్పుడు కాకుండా మత్తు పదార్థాలను విక్రయిస్తున్నారా..? లేదా టీ పదార్థాలలో కలుపుతున్నారా అన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఎవరైనా చట్ట విరుద్ధంగా మత్తు పదార్థాలను విక్రయించిన, పదార్థాలు, తిను బండారాలు, పానీయాలలో కలిపిన శాఖా పరమైన చర్యలు తప్పవని నిర్వాహకులకు హెచ్చరించారు. అనంతరం రామేశ్వర్ పల్లి గ్రామంలో కల్లు దుకాణాన్ని తనిఖీ నిర్వహించి శాంపిల్ సేకరించి ల్యాబ్ కు పంపించినట్లు తెలిపారు. ఈ తనిఖీలలో ఎక్సైజ్ శాఖ కానిస్టేబుల్, సిబ్బంది, తదితరులు ఉన్నారు.