ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తున్న పత్రిక నవతెలంగాణ

నవతెలంగాణ-కంఠేశ్వర్
ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తున్న దినపత్రిక నవ తెలంగాణ దినపత్రిక అని నిజామాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజ వెంకట్ రెడ్డి తెలిపారు. తొమ్మిదవ వార్షికోత్సవం జరుపుకుంటున్న నవ తెలంగాణ దినపత్రికకు పత్రికలో పనిచేస్తున్న సిబ్బందికి నవ తెలంగాణ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. నవతెలంగాణ దినపత్రిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెలికి తీసి అధికారులకు ప్రభుత్వాల దృష్టికి తీసుకు వెళ్తున్న పత్రిక. గతంలో ప్రజాశక్తిగా ఉన్నటువంటి పత్రిక ప్రస్తుతం నవ తెలంగాణగా రూపొంది మళ్లీ ప్రజల వద్దకు చేరుకుంటుంది. అదే నడవడికతో ముందుకు కొనసాగాలని కోరుతున్నాం. పత్రిక శాంతియుతంగా శాంతి,సమానత్వం తో ముందుకు సాగాలి.