నవతెలంగాణ- కంఠేశ్వర్
ప్రజల పక్షాన ఉంటూ ప్రశ్నించే గళం వినిపించే పత్రిక నవ తెలంగాణ దినపత్రిక అని ఛాతి వైద్య నిపుణులు,క్రిటికల్ కేర్ స్పిటీలిస్ట్ డాక్టర్ బొద్దుల రాజేంద్ర ప్రసాద్ అన్నారు. నిరంతరం ప్రజల శ్రేయస్సును కోరే పత్రిక నవ తెలంగాణ దినపత్రిక. అన్ని వర్గాల ప్రజలను ఒకే తాటి పైకి తీసుకువచ్చి తేడాలు లేకుండా సమ న్యాయం చేసే పత్రికగా పేరుపొందింది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి లో ఆటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్య వారాధిగా ఉంటు నిరంతరం ప్రజల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకొని పరిష్కారంలో ముందుంటున్న పత్రిక నవతెలంగాణ తెలుగు దిన పత్రిక. ఇలాంటి పత్రిక ప్రకటన కర్తలకు, పాఠకులకు మరింత దగ్గర అవ్వాలని ఆశిస్తూ 9వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే విజయవంతంగా 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నవ తెలంగాణ తెలుగు దిన ప్రతిక కుటుంబ సభ్యులకు శుభా కాంక్షలు తెలియజేశారు. భవిష్యత్లో కూడా ఇలాంటి వార్షకోత్సవాలు జరుపుకోవాలని కోరుతున్నామన్నారు.