నవతెలంగాణ – కంఠేశ్వర్
పేదల సమస్యలను నవ తెలంగాణ దిన పత్రిక ద్వారా ప్రచురితం చేసి అధికారులకు, ప్రభు త్వానికి, సమాజం దృష్టి తీసుకురావడం, ఆ తర్వాత సమస్యలను పరిష్కరించే విధంగా వారు ప్రయత్నం చేయడం ఎంతో హర్షించదగ్గ విషయం. నిజాన్ని నిర్భయంగా, నిస్పక్ష పాతంగా చాటుతున్నది నవ తెలంగాణ. ప్రజలు కార్మికులు కర్షకులు ప్రతి ఒక్కరూ చేసే పోరాటాలలో తన వంతు భాగంగా పనిచేస్తూ ప్రజలందరినీ చైతన్యం చేస్తూ ముందుకు తీసుకు వెళుతున్న పత్రిక నవ తెలంగాణ దినపత్రిక. సమాజీక న్యాయంతో అందరికి అన్ని వర్గాల ప్రజల హక్కులు అందాలంటూ తనదైన శైలిలో వార్త కథనాలు అందించే పత్రిక సవ తెలంగాణ నేడు తొమ్మిదో వార్షికోత్సవం సందర్భంగా యాజమాన్యానికి, సిబ్బంది జర్నలిస్టులకు శుభాకాంక్షలు తెలియజేశారు.