నవతెలంగాణ – కంఠేశ్వర్
ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రజల పక్షాన నిలిచి పేరొందిన పత్రిక నవ తెలంగాణ పత్రిక అని మనోరమ హాస్పిటల్ న్యూరో సర్జన్ కట్ట నరసింహ తెలిపారు. ప్రగతి వైపు మాత్రమే దృష్టి పెట్టిన పత్రిక ఒకటి అంటే అది నవ తెలంగాణ. ఉద్యమాలకు పదివేల సైన్యం సమకూరినంత బలం ఉన్న పత్రిక. నవతెలంగాణ పత్రిక ఇండా లోతైన విశ్లేషణలతో ముం దుకు వెళ్లాలి. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారాధిగా నవతెలంగాణ తన పాత్రను మరింతగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము.తొమ్మిదో వార్షికోత్సవం సందర్భంగా నవతెలంగాణ ప్రయాణం నవనవోన్మేషంగా, బాధ్యతాయుతంగా కొనసాగాలని కోరుకుంటున్నాము. 9 సంవత్సరాలు పూర్తి చేసు కున్న సందర్భంగా పత్రిక యాజమాన్యానికి సిబ్బందికి, జర్నలిస్టులకు నవతెలంగాణ కుటుంబ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.