నవాబులు.. సుల్తానుల అరాచకాలపై మౌనమా..!

నవాబులు.. సుల్తానుల అరాచకాలపై మౌనమా..!– కాంగ్రెస్‌ బుజ్జగింపు రాజకీయాలు ప్రమాదకరం : ప్రధాని మోడీ
బళ్లారి : కాంగ్రెస్‌ బుజ్జగింపు రాజకీయాలు దేశానికి, కర్నాటకకు ప్రమాదకరమని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. కర్నాటకలోని బళ్లారి, బెళగావి తదితర ప్రాంతాల్లో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ రాజకీయ లబ్ధికోసం ఎంతకైనా తెగిస్తుందని, నిషేధానికి గురైన పీఎఫ్‌ఐ కొమ్ముకాస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్‌ యువరాజు రాజులు, మహారాజులను అవమానించారని, నవాబులు, నిజాంలు, సుల్తానుల అరాచకాలపై మౌనంగా ఉన్నారని అన్నారు. ఓటు బ్యాంకును దృష్టిలో ఉంచుకుని దేశ చరిత్ర, స్వాతంత్య్ర పోరాటాలకు సంబంధించిన పుస్తకాలను కాంగ్రెస్‌ రాయించిందని అన్నారు. ఇండియా బ్లాక్‌ గెలిస్తే, ప్రధానిగా ఒక్కొక్కరూ ఒక ఏడాది చొప్పున పరిపాలించే ఫార్ములాను రూపొందించిందని మరోసారి ఆరోపణలు గుప్పించారు. అటువంటి వ్యవస్థతో దేశానికి మంచిని ఆశించలేమన్నారు.