కార్మిక వ్యతిరేకులుగా చరిత్రలో మిగిలిపోతారు: నాయక్ వాడి శ్రీనివాస్

నవతెలంగాణ- నవీపేట్: పారిశుద్ధ్య కార్మికులు చట్టబద్ధంగా న్యాయమైన డిమాండ్ల కోసం సమ్మె చేస్తుంటే పోలీసు పహారాలో కార్మికులను అరెస్టు చేసి పోటీ కార్మికులతో సఫాయి పనులను పాలకవర్గం చేయడం చరిత్రలో కార్మిక వ్యతిరేకులుగా మిగిలిపోతారని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు నాయక్ వాడి శ్రీనివాస్ అన్నారు. సమ్మె 13వ రోజు సందర్భంగా పోలీసులు రాత్రి మూడు గంటల తర్వాత  మహిళా కార్మికులని చూడకుండా ఇంట్లోకి చొరబడి అరెస్టు చేయడం హేయమైన చర్య అని అన్నారు. 56 మంది కార్మికులపై 150 సి ఆర్ పి ప్రకారం కేసులు నమోదు చేయడం పట్ల ప్రభుత్వం, పాలకవర్గం కార్మికులపై ప్రతీకార చర్యలకు పూనుకున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో దేవేందర్ సింగ్, లక్క గంగారం, ఆంజనేయులు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.