గ్లోబల్‌ ఫార్మా లీడర్‌గా భారత్‌

– మంత్రి జితిన్‌ ప్రసాద
న్యూఢిల్లీ : భారత్‌ ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ గమ్యస్థానంగా, గ్లోబల్‌ ఫార్మా లీడర్‌గా ఎదుగుతోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్‌ ప్రసాద పేర్కొన్నారు. గ్రేటర్‌ నోయిడాలో ఏర్పాటు చేసిన ఫార్మా అండ్‌ హెల్త్‌కేర్‌ ఎగ్జిబిషన్‌ ఐపెక్స్‌్‌ 2024 అంతర్జాతీయ ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు. ఇక్కడ 400 పైగా భారత ఫార్మా కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి. ఔషధ రంగం భారత జిడిపికి గణనీయమైన మద్దతును అందిస్తుందని జితిన్‌ పేర్కొన్నారు. 2023-24 ఫార్మా ఎగుమతుల్లో 9 శాతం వృద్థి చోటు చేసుకుందన్నారు.