ప్రయాణ ప్రాంగణంలో నీటీ వసతి కల్పన..

నవతెలంగాణ – జుక్కల్

మండల కేంద్రంలోని ప్రయాణ ప్రాంగణంలో నీటివసతి కల్పించడం జర్గిందని కాంగ్రేస్ పార్టీ మండల వర్కింగ్ ప్రసిడెంట్  అస్పత్ వార్ వినోద్ తెలిపారు. కొన్నెండ్ల క్రితం ఎంరినిధులతో అదునాతనంగా మూత్రశాలలు నిర్మాణం చేపట్టిన గుత్తేదారుడు అర్ద్రాంతరంగా వదిలేసాడు. మహిళలకు , బాలీకలకు వాష్ రూం కు వెళ్లేందుకు తప్పని తిప్పలు అంతాఇంతా కావు, ముళ్లపొదల చాటున  వెళ్లేదుస్తితి నెలకొంది. నీటివసతి కూడా లేకపోవడంతో బస్టాండ్ ఖాలీ ప్రదేశంలో హరితహరం మెుక్కలు నాటినవి ఎండిపోవడంతో  పాటు నీటిసమస్య తీవ్రంగా మారింది. చలించిన కాంగ్రేస్ నాయకులు ఎమ్మెలే లక్ష్మీకాంతారావ్ తోట దృష్టికి తీసుకెళ్లడంతో  ఆయన సలహతో మూత్ర శాలల పెండింగ్ పనులను చేపట్టి పూర్తీచేయాలని,  దాంతో పాటు ఇటివలే   మూడురోజుల  క్రితం బోరు తవ్వకం చేపట్టారు. ప్రస్తుతం బోరు మెాటారు బిగించి ప్రయాణికులకు  నీటీ వసతి కల్పించారు. నీటీవసతి కల్పించడంతో ప్రయాణికులు ప్రత్యేకంగా మండల కాంగ్రేస్ నాయకులకు కృతఙ్ఞతలు తెలిపారు.