సోషల్ వెల్ఫేర్ మైనార్టీ కేజీబీవీ హాస్టల్లో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు కావాల్సిన మౌలిక వసతులను తక్షణమే ఏర్పాటు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వద్దిరాజు రామచంద్రరావు ప్రభుత్వ చేశారు. మండల కేంద్రంలో మంగళవారం సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేజీబీవీ, సోషల్ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్ మరియు వివిధ హాస్టల్లో చదువుతున్న విద్యార్థులకు అన్నం కూరగాయలు వివిధ రకాలైన వాటికోసం విద్యార్థుల ఖండించేందుకు ప్రభుత్వం టెండర్ నిర్వహించి హాస్టల్లో సప్లై నిర్వహిస్తుందని అన్నారు. అలా నిర్వహిస్తున్న సప్లైదారులకు సుమారు ఆరు నెలల నుంచి వారికి రావాల్సిన బిల్లులు రాక కాంట్రాక్టు దారులు పూర్తిస్థాయిలో విద్యార్థులకు నాణ్యమైన వాటిని అందించడంలో విఫలం చెందుతున్నారని అన్నారు. బిల్లులు రాకపోవడంతో ఎంతో కొంత నాణ్యత లేకుండా వారి ఇష్టం ఉన్నట్లు పెట్టడం వల్ల విద్యార్థులు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. నాణ్యమైన భోజనం నాణ్యమైన కూరగాయలు అందించకపోవడంతో విద్యార్థులు ఆరోగ్యంగా లేకపోవడంతో పూర్తిస్థాయిలో విద్యను అభ్యసించడంలో ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ప్రభుత్వం విద్యార్థులపై చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం వెంటనే సంబంధిత కాంట్రాక్టు దార్లకు రావాల్సిన పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు కొన్ని హాస్టలను పర్మినెంట్ లేక అద్దెకు తీసుకొని నడుపుతున్నారని అలా కాకుండా పర్మినెంట్ హాస్టలను ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు చందు రాజ్ కుమార్ యాదవ్ దేవేందర్ రెడ్డి శివ సాయి తదితరులు పాల్గొన్నారు.