విలాసం కన్నా అవసరం గొప్పది

విలాసం కన్నా అవసరం గొప్పదిఅర్జున్‌ కళ్యాణ్‌, కుషిత కల్లాపు జంటగా నటించిన చిత్రం ‘బాబు’. ట్యాగ్‌ లైన్‌ ‘నెంబర్‌ వన్‌ బుల్‌ షిట్‌ గై’. డీడీ క్రియేషన్స్‌ బ్యానర్‌ పై దండు దిలీప్‌ కుమార్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎంఎల్‌ఆర్‌ (లక్ష్మణ్‌ వర్మ) ఈ సినిమాకు దర్శకుడు. విలాసం కన్నా అవసరం గొప్పది అనే కథాంశంతో ఈ సినిమాని తెరకెక్కించారు. ఫ్యామిలీ ఎమోషనల్‌ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉండబోతోంది. ప్రస్తుతం ఈ మూవీ అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. త్వరలోనే విడుదలకు సిద్దం కానుంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్‌ కంటెంట్‌ అందరినీ ఆకట్టుకుంది. తెలుగు, తమిళ్‌, కన్నడ భాషల్లో రాబోతోన్న ఈ చిత్రంలో ఎంఎల్‌ఆర్‌, సోనాలి, మురళీధర్‌ గౌడ్‌, భద్రం, జబర్దస్త్‌ అప్పారావు, రవి వర్మ, సునీత మనోహర్‌, అశోక్‌ వర్దన్‌, భద్రి జార్జి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : పవన్‌, కెమెరామెన్‌ : పీఎస్‌ మణికర్నన్‌, ఎడిటర్‌ : డి.వెంకట్‌ ప్రభు.