మనుషులు కావాలి

Need peopleకార్పొరేట్‌ డైనోసార్‌ నోట’హిందుత్వ ‘మంట
మొన్న గుజరాత్‌, నేడు మణిపూర్‌
ఆ మంటల్లో కాలిపోతున్నాయి!

ఇది ‘కార్పొరేట్‌ ‘తరహా పోడు వ్యవసాయం!
నీ కాళ్ళకింద ఖనిజాలున్నాయని తెలిస్తే చాలు
నిన్ను నిలువునా కాల్చేస్తారు!
నీ సాటివాడు నీతోడు రాకుండా
మతం, కులం, ప్రాంతం అంటూ
ఏదో ఒక మంట రగిలిస్తారు!

వాళ్ళ వ్యవసాయానికి
మానవ కళేబరాలే ఎరువు!
ఖనిజ సంపదలు కొల్లగొట్టి
అంతస్తులకొద్దీ ఆస్తులు
కూడగట్టుకోవడమే వాళ్ళపని!

ఈశాన్యం ఎక్కడో వుందని
వాళ్ళంతా మన వాళ్ళు కాదులే అని
మతిలేని మాటలు విని
పట్టించుకోకుండా వుంటే,
రేపు మన ఆవాసాలూ లేచిపోతాయి
మనంకూడా అలాంటి మంటల్లోనే కాలిపోతాం!

రాబందుల రెక్కల చప్పుడు ఇప్పటికే
మన రాష్ట్రంలోనూ వినబడుతోంది!
హిందుత్వ వైరస్‌ చాపకింద నీరులా పాకుతోంది!
ఆ డైనోసార్‌ రాకకోసం రంగం సిధ్ధం చేయడుతోంది!
మనం నమ్ముకున్న పాలకులంతా
దానికి దాసోహం అంటున్నారు!

దాని మంటలు మనమీద విరుచుకు పడకముందే
మనమంతా మనుషులుగా ఏకం కావాలి!
మనిషంటే దానికి భయం!మానవత్వమంటే
దానికి వణుకు!ఐకమత్యంతోనే దాన్ని
గ్రహాంతరాలకు తరిమికొట్టగలం!!
-సత్య భాస్కర్‌, 9848391638