వేల్పూర్ మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళ అధ్యక్షురాలు నీరడి భాగ్య రాష్ట్ర మంత్రి, బీఆర్ఎస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ మేరకు సోమవారం వేల్పులోని తన స్వగృహంలో నీరడి భాగ్యకు ప్రశాంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ యూత్ నాయకులు భూపాల్, భీంగల్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కర్నే చిన్న గంగయ్య, బీజేపీకి చెందిన చెక్కల నర్సింగ్, గ్రామ అభివృద్ధి కమిటీ మాజీ సభ్యుడు లింబాద్రి, అరవింద్, తదితరులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి మంత్రి ప్రశాంత్ రెడ్డి కండువాలను కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గంలో ముచ్చటగా మూడోసారి ప్రశాంత్ రెడ్డి విజయం సాధించడంలో తమ వంతు పాత్ర పోషిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల ప్రజా ప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.