ఇందల్ వాయి ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా నీరడీ గంగాధర్ ఎన్నిక..

నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి మండల ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని శనివారం సమావేశమై ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అద్యక్షులుగా నీరడీ గంగాధర్ “ఆంద్రజ్యోతి” ని ఎన్నుకోగా,  గౌరవ అధ్యక్షులుగా సయ్యద్ నయీమ్ “నవతెలంగాణ” ,ప్రధాన కార్యదర్శిగా  పూజ్యం రవికుమార్ “ఆంద్ర ప్రభ”, ఉపాధ్యక్షులుగా శ్రీపతి జితేందర్  “మన తెలంగాణా”,సంయుక్త కార్యదర్శిగా పాశం నర్సయ్య “చట్టం”, కోశాధికారిగా రాకేష్ “వెలుగు”, ఎగ్జిక్యూటివ్ మెంబర్ జెగ్గ రాములు ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం నూతన అధ్యక్షులు నీరడీ గంగాధర్ మాట్లాడుతూ పాత్రికేయుల సమస్యల కోసం ముందుండి పోరాడతానని, అందరికీ న్యాయం జరిగేలా పాత్రికేయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కార్యవర్గ సభ్యుల సహయ సహకారంతో కృషి చేస్తానన్నారు. తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రింట్ మీడియా మండల పాత్రికేయులందరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వివరించారు.