– 89.49మీటర్లు జావెలిన్ విసిరి రెండో స్థానం
– 90.61మీ.తో వేసి ఆండర్సన్ పీటర్స్ ప్రథమ స్థానం
లాసన్నె (స్విట్జర్లాండ్):
లాసన్నె వేదికగా జరిగిన డైమండ్ లీగ్ జావెలిన్ త్రో విభాగంలో నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచాడు. శుక్రవారం జరిగిన జావెలిన్ త్రో.. ఆరో ప్రయత్నంలో నీరజ్ తన జావెలిన్‌ను 89.49 మీటర్ల దూరం విసిరాడు. ఈ సీజన్‌లో నీరజ్‌కు ఇదే అత్యుత్తమ త్రో. పారిస్ ఒలింపిక్స్‌లో నీరజ్ 89.45మీటర్ల దూరం విసిరి రెండోస్థానంలో కాంస్య పతకం కైవసం చేసుకోగా.. డైమండ్ లీగ్‌లో ఆ ఫీట్‌ను సవరించాడు. ఇక 2022లో స్టాకహేోమ్ వేదికగా జరిగిన డైమండ్ లీగ్‌లో నీరజ్ చోప్రా జావెలిన్‌ను 89.94 మీటర్ల దూరం విసిరాడు. ఇదే అతని కెరీర్‌లో బెస్ట్ త్రో. నిజానికి లాసన్నె డైమండ్ లీగ్‌లో నీరజ్‌చోప్రా తొలి ఐదు ప్రయత్నాలను ఆశించిన స్థాయిలో వేయలేకపోయాడు. తొలి అయిదు ప్రయత్నాల్లో 82.10మీ, 83.21మీ, 83.13మీ, 82.34మీ, 85.58మీ. దూరం విసిరాడు. గ్రెనెడాకు చెందిన అండర్సన్ పీటర్స్ ఈ సీజన్‌లో మీట్ రికార్డు క్రియేట్ చేశాడు. అతను 90.61 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరాడు. జర్మనీకి చెందిన జులియన్ వెబర్ 87.08 మీటర్ల దూరం విరిసి మూడవ స్థానంలో నిలిచాడు. పారిస్ ఒలింపిక్స్‌లో ఆండర్సన్ 88.54మీ.తో కాంస్య పతకం చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆ ఒలింపిక్స్‌లో పాకిస్తాన్‌కు చెందిన ఆర్షాద్ నదీమ్ 92.97మీ. త్రో చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పడం తో పాటు స్వర్ణ పతకం ఎగరేసుకుపోయాడు. జులి యన్‌వెబెర్ పారిస్‌లో 87.40మీ.తో 6వ స్థానానికే పరిమితమైనా.. డైమండ్ లీగ్‌లో మూడో స్థానంలో నిలిచాడు. ఈ టోర్నీకి పాకిస్తాన్ స్టార్ త్రోయర్ ఆర్షాద్ నదీమ్ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.