– సంవత్సరంలో నలుగురు ఎస్సైలు బదిలీ
నవతెలంగాణ – చందుర్తి
స్థానిక పోలీస్ స్టేషన్లో సంవత్సర కాలం గా నలుగురు ఎస్సైలు బదిలీలు కావడం జరిగింది.తాజాగా సబ్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ ను శుక్రవారం అప్పటికప్పుడు ఎస్పీ తన కార్యాలయానికి అటాచ్ చేయడంతో మండలంతొ పాటు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.
పలు కేసులు పట్ల నిర్లక్ష్యమే కారణమా ?
పలువురు ఫిర్యాదుల దారుల ను స్టేషన్ కు వచ్చిన పట్టించుకోకుండా కేసులను నీరుగార్చే విదంగా వ్యవహరించడాని కొందరు బాధితులు ఆరోపించారు. ఎన్గల్ గ్రామానికి చెందిన మ్యాకల జలందర్ ఇంటి గోడ నిర్మాణం లో భాగంగా అదే గ్రామానికి చెందిన మల్లేశం పై ఫిర్యాదు చేయగా ఎస్సై పట్టించుకోక పోవడంతో బాధితుడు స్టేషన్లో పురుగు మందు డబ్బతో ఆత్మహత్య కు యత్నించిన విషయం తెలిసిందే.అనంత పల్లి గ్రామానికి చెందిన లచ్చయ్య అనే రైతు భూమిని ఫోర్జరీ సంతకాల తో మరో రైతు పట్టా చేసుకోవడం తో ఆ రైతు పై కేసు పెట్టాలని కోర్టు నోటీసులు ఇవ్వగా నిర్లక్ష్యంగా వ్యవరించడాని అదేవిదంగా ఓ గంజాయి నిందితుడు స్టేషన్ నుండి పారిపోయిన ఘటన మండలంలో సంచలనం రేకెత్తింది. గత ఇరవై రోజుల కిందట తిమ్మాపూర్ గ్రామంలో ఇద్దరు వ్యక్తులు ఘర్షణ పడి దాడి చేసుకోగా దాడి చేసిన వ్యక్తి పై కేసు పెట్టకుండా బాధితుని పై కేసు పెట్టి జైల్ కు పంపించడం తో ఎస్సై పై శుక్రవారం ఎస్పీ అఖిల్ మహాజన్ కు బాధిత మధు కుటుంబ సభ్యులు పిర్యాదు చేయడం జరిగింది.మరో వైవుగా అవినీతి ఆరోపణలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఎస్సై శ్రీ కాంత్ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడ మే ఆయన ట్రాన్స్ఫర్ కు కారణం? అని మండలం లో హాట్ టాపిగా మారింది.దీంతో సంవత్సరంలో నలుగురు ఎస్సైలు మారడంతో జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.