గ్రామ పంచాయతీ అధికారులా సమయ పాలనలో నిర్లక్ష్యం

నవ తెలంగాణ – బాల్కొండ 
మండల పరిధిలోని బోదెపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ సంబంధిత అధికారులు సమయపాలనలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గ్రామాలలో గ్రామ పంచాయితీ ఉదయం ప్రజలకు అందుబాటులో ఉండవలసిన అధికారులు ఉదయం 9:00 కావస్తున్న అధికారులు జాడలేదు, పై అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండవలసిన అధికారులు వారి ఇష్ట రాజ్యాంగ మారింది. సర్పంచుల పదవీకాలం  ముగియడంతో అధికారుల ఇష్ట రాజ్యాంగ మారింది. ఎప్పుడు వచ్చినా సరే మేము వచ్చినప్పుడు పని చేయించుకోవాలి, అన్నట్లుగా ఉంది పై అధికారులు స్పందించి సమయపాలన పట్టికను ఎవరు ఏ సమయం వరకు ఉంటారో గ్రామపంచాయతీ ముందర ఉంచాలని ప్రజలు కోరుతున్నారు.ఇది ఇలా ఉండగా గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులలో నిర్లక్ష్యం, మొక్కల పెంపకంలో కూడా అశ్రద్ధ వహిస్తున్నారు, ప్రతిరోజు చేయవలసిన పనులు కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు, గత కొన్ని రోజుల క్రితం మండల కేంద్రంలో జరిగిన ప్రజా వేదికలో కూడా జిల్లా అధికారి డిఆర్డిఏ పి డి చందర్ నాయక్  కూడా హెచ్చరించడం జరిగింది,  అయినా అధికారులలో మార్పు రాలేదు.