విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం, మూగ జీవుల బలి

నవతెలంగాణ – ఉప్పునుంతల
నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం తిర్మలాపురం గ్రామం వ్యవసాయ పొలాల్లో ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ వద్ద ఎర్త్ రావడం వల్ల షాక్ కొట్టి ఎద్దు మృతి చెందిన ఘటన బుధవారం తిర్మాలాపురం గ్రామానికి చెందిన రైతు జిల్లేల మల్లారెడ్డి ఎద్దు మేత మెస్తు ట్రాన్స్ ఫార్మర్ ఉన్న పరిసరాల్లోకి వెళ్లగానే భూమి నుండి విద్యుత్ ప్రసారం వల్ల షాక్ కొట్టి ఎద్దు మృతి చెందింది అని రైతు తెలిపారు. ఇదే ట్రాన్స్ ఫార్మర్ వద్ద గతంలో రెండు సార్లు పశువులు మృత్యువాత పడ్డాయి అని గ్రామం లోని  రైతులు తెలిపారు. పోరపాటున మనుషులు వెళ్లినా షాక్ కొట్టెది ప్రాణాపాయం జరిగేది అని గ్రామ రైతులు అంటున్నారు. గతంలో విద్యుత్ సిబ్బందికి, గ్రామ అధికారులకు చెప్పినా ట్రాన్స్ ఫార్మర్ వద్ద మరమత్తులు చేయకుండా నిర్లక్ష్యం చేసారు. ఇప్పటికే అక్కడ విద్యుత్ స్తంభ ఒరిగింది. ట్రాన్స్ ఫార్మర్ ఆఫ్ చేయడానికి వీలులేకుండా ఉంది.ఇప్పటికైనా సిబ్బంది అధికారుల స్పందించి మరమత్తులు చేసి మూగ జీవుల ప్రాణాలు కాపాడాలని గ్రామ రైతులు వేడుకుంటున్నారు. స్పందించిన ఎడలపై అధికారులకు ఫిర్యాదు చేస్తాము అని రైతులు డిమాండ్ వ్యక్తం చేశారు.