
నవతెలంగాణ – బొమ్మలరామారం
ప్రజల సమస్యలు పరిష్కరించడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి వరద సభ్యులు దాసరి పాండు అన్నారు. బుధవారం మండల కేంద్రంలో సీపీఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో రెవెన్యూ కార్యాలయాన్ని సమస్యల పైన పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా దాసరి పాండు మాట్లాడుతూ… రెవెన్యూ ఆఫీసులో ప్రభుత్వ ఉద్యోగులు సరిపడక ప్రవేటు ఉద్యోగస్తులతో పని చేయించుకుంటూ రోజుల తరబడిగా రైతుల సమస్యలు ప్రజల సమస్యలు పెండింగ్లో పెడుతున్నారని పరిష్కారం చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నదని ఇప్పటికీ ధరణిలో దరఖాస్తు చేసుకున్న రైతులు పహాని కోసం దరఖాస్తు చేసుకున్న రైతులు ఆఫీసు చుట్టూ తిరుగుతున్న సమాచారం ఇవ్వడం లేదని అధికారులు కూడా సమయానికి ఆఫీసుకు రాకపోగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని భూ సమస్యలు రైతుల సర్వే నెంబర్లు తారు మారాయి సమస్యలు అనేకమంది రైతులు ఎదుర్కొంటున్న గాని అధికారులు పట్టించుకోవడంలేదని ధరణి పేరుతో సర్వే నెంబర్లు బొమ్మలరామారం మండలంలో ఉన్న రెవెన్యూ అధికారులు వెంటనే రెవెన్యూ పరిధిలో ఉన్న పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని లేని పక్షంలో ప్రజలను రైతులను సమీకరించి ఆందోళన చేస్తామని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ర్యకలశ్రీశైలం, కమిటీ సభ్యులు బ్రహ్మచారి ,లక్ష్మయ్య, కిష్టయ్య, ఎల్లయ్య ముక్కర్ల పున్నమ్మ,దేశెట్టి సత్యనారాయణ,తదితరులు పాల్గొన్నారు.