పిల్లల ఉజ్వల భవిష్యత్‌ కోసం… నేహా శర్మ, సౌమ్య జగన్నాథ్‌…

For the bright future of children... Neha Sharma, Soumya Jagannath...ఈ ఇద్దరు తల్లులు కరోనా సమయంలో తమ పిల్లల స్క్రీన్‌ సమయాన్ని చూసి ఆందోళన చెందారు. దాని నుండి పిల్లల్ని కాపాడుకోవడం కోసం ఎంతో ప్రయత్నించారు. ఆ ఆలోచనతోనే ఆడియో కంటెంట్‌ కోసం వోబుల్‌ అనే ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ ప్రారంభించారు. తద్వారా పిల్లల కోసం ఉజ్వల భవిష్యత్తును రూపొందిస్తున్నారు. నాలుగేండ్ల నుండి పదేండ్ల మధ్య వయసు గల పిల్లల కోసం ఆడియో కథనాలు, గేమ్‌ షోలు, సంగీతం వంటి ఆడియోలు వినిపిస్తున్నారు. ఆ వివరాలేంటో మనమూ తెలుసుకుందాం…
నాలుగేండ్ల మైరా తన హెడ్‌ఫోన్స్‌తో కూర్చుని, ఆడియో కథలు వినడంలో మునిగిపోయింది. అలాగే డ్రాయింగ్‌కు రంగులు వేయడం ప్రారంభించింది. తాను విన్న ఆడియో కథల్ని పేపర్‌పై కూడా రాస్తుంది. దీన్ని చూసిన ఆమె తల్లి జప్నిత్‌ కౌర్‌కు తన బిడ్డకు సరైన మార్గాన్ని ఎంపిక చేసుకున్నందుకు ఆనందించింది. మైరా గత రెండు నెలలుగా ఆడియో కథనాలు, గేమ్‌ షోలు, సంగీతం వంటి యాక్టివిటీలతో నిండిన ఆడియో ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ అయిన Vobbleవని ఉపయోగిస్తోంది. ‘ఈ కథలు వినడానికి, కార్యకలాపాలు చేయడానికి మా అమ్మాయి ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటుంది. దీనివల్ల తను ఫోన్‌, వీడియో గేమ్స్‌తో గడిపే సమయాన్ని కూడా తగ్గించింది’ అని కౌర్‌ అంటున్నారు. నేహా శర్మ, సౌమ్య జగన్నాథ్‌ కలిసి 2022లో ప్రారంభించిన ఈ Vobbleరీవ పిల్లల కోసం 1,000 నిమిషాల కంటే ఎక్కువ కంటెంట్‌ని కలిగి ఉంది. ఒక ఏడాదిలోనే బెంగళూరుకు చెందిన ఈ కంపెనీ ఆగస్టు నుండి 200 మంది చందాదారులతో రూ. 6 లక్షల ఆదాయాన్ని పొందింది. ‘ఈ ఆలోచన పిల్లల దష్టిని స్క్రీన్‌ నుండి ధ్వనికి మార్చడం, వారి ఊహ, సజనాత్మకతను ప్రేరేపించింది’ అని నేహా చెప్పారు.
స్క్రీన్‌ సమయాన్ని తగ్గించడం
ప్రతి నెల Vobbleవ హార్పర్‌ కాలిన్స్‌ ఇండియా, అమర్‌ చిత్ర కథ, స్కొలాస్టిక్‌ తులికాతో పాటు ఇతర ప్రచురణల నుండి 250 నిమిషాల కంటెంట్‌ తీసుకుంటారు. మరో 50 నిమిషాలు ఇంట్లో తయారు చేసిన కంటెంట్‌ను దానికి జోడిస్తారు. ‘ఈ పబ్లికేషన్‌లు 0-30శాతం మధ్య ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మేము క్విడ్‌ ప్రోకో అమరికను ఏర్పాటు చేస్తాం. దీనిలో మేము ఆ ప్రచురణ నుండి కొత్త కంటెంట్‌ని సష్టిస్తాం. వారు మా ఆడియో కంటెంట్‌ను Vobbleవ బ్రాండింగ్‌ కింద ఉపయోగించుకోవచ్చు’ అని నేహా వివరించారు. మొదట తల్లిదండ్రులు Vobbleలో వారి పిల్లల ప్రొఫైల్‌ని నింపుతారు. పిల్లలు ఆడియోను ఎంత సేపు వింటున్నారో అందులో నమోదు చేస్తారు. దీని ఆధారంగా ప్లాట్‌ఫారమ్‌ పిల్లల వయసును నిర్ణయిస్తుంది. హౌమ్‌ పేజీలో వయసుకి తగిన కంటెంట్‌ను మాత్రమే చూపుతుంది. ‘ప్రతి కంటెంట్‌ పీస్‌కి దాని ముందు పేర్కొన్న వయసు కూడా ఉంటుంది. పిల్లల కోసం సరైన కంటెంట్‌ను క్యూరేట్‌ చేయడానికి మాకు నిపుణుల ప్యానెల్‌ ఉంది’ అని ఆమె జోడించారు.
కొత్త కంటెంట్‌ అందిస్తుంది
Vobble కంటెంట్‌ను నమ్మదగినదిగా చేయడానికి పిల్లలచే ఈ ఆడియో కథనాలను రికార్డ్‌ చేయిస్తారు. వారి తల్లిదండ్రులకు డబ్బు ఎంత చెల్లించాలో చూపడంతో పాటు Vobble హాంపర్‌లను అందిస్తుంది. ఆరేండ్ల కూతురు ఉన్న మధుమిత మాట్లాడుతూ తన కుమార్తెకు వాయిస్‌ యాక్టింగ్‌ని ప్రయత్నించడం కొత్త మార్గమని చెప్పింది. ‘స్టూడియోలో తనను తాను సెటప్‌ చేసుకోవడం, మైక్‌లో సరిగ్గా మాట్లాడటం, అద్భుతమైన సాంకేతిక నిపుణులతో రికార్డింగ్‌ పరికరాలను ఉపయోగిస్తూ ఎన్నో నైపుణ్యాలను నేర్చుకుంది. దీన్ని మా పాప చాలా ఆనందిస్తుంది. అంతేకాదు తన సొంత కథలను యాప్‌లో పదే పదే వినడానికి ఇష్టపడుతుంది. ఇంకా తన కథలను అందులో రికార్డ్‌ చేయడానికి ఉత్సాహంగా ఉంది’ అని ఆమె జతచేస్తుంది. ‘వినడం అనేది చాలా మంచి లక్షణం. ఆడియోలు వింటూ పిల్లలు కంటెంట్‌లో మునిగి పోతారు. Vobbleరీవ కూడా క్రమం తప్పకుండా కొత్త కంటెంట్‌ని అందిస్తుంది. కాబట్టి లాంగ్‌ కార్‌ రైడ్‌ల సమయంలో పిల్లలు వినడానికి కొత్త కథనాలు అందులో ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. Vobbleరీవ ఆడియో కంటెంట్‌ కావాలనే 10 నిమిషాల గరిష్ట వ్యవధితో చిన్నదిగా రూపొందించబడిందని నేహా చెప్తున్నారు. పిల్లల ఆసక్తిని గమనించి ఓ ఆలోచనతో ఇది రూపొందించబడింది. ‘పిల్లలు ఆడియో కంటెంట్‌ను వినడం ప్రారంభించి వాటిని వినడానికి ఆసక్తి చూపుతున్నట్టు మేము గమనించాము. కాబట్టి దాన్ని దష్టిలో ఉంచుకుని మా ప్లాట్‌ఫారమ్‌లోని కంటెంట్‌ వ్యవధిని పెంచుతుంటాము’ అని ఆమె జతచేస్తున్నారు.
ఎలా మొదలైంది?
నేహా, సౌమ్య ఇరుగుపొరుగువారు. అతి తక్కువ కాలంలోనే వారి పిల్లలు కూడా సన్నిహితులయ్యారు. నేహా ఢిల్లీ విశ్వవిద్యాలయంలో మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ ఫ్యాకల్టీ నుండి ఎంబీఏ చేశారు. సౌమ్య మిచిగాన్‌ విశ్వవిద్యాలయం నుండి న్యూరోసైన్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. ఆమె సష్టి మణిపాల్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆర్ట్‌, డిజైన్‌ అండ్‌ టెక్నాలజీ నుండి ఆట, విద్యపై దష్టి సారించే మానవ-కేంద్రీకత రూపకల్పనలో నైపుణ్యాన్ని కలిగి ఉంది. మహమ్మారి సమయంలో ఈ ఇద్దరు తల్లులు తమ పిల్లల స్క్రీన్‌ సమయం పెరగడం గురించి ఆందోళన చెందారు. పరిష్కారాల కోసం తీవ్రంగా వెతికారు, కానీ ప్రయోజనం లేదు. దాంతో సెప్టెంబర్‌ 2022లో Vobbleరీవని ప్రారంభించడానికి వారు తమ ఉద్యోగాలను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారు. ‘దేశంలో పోడ్‌కాస్ట్‌ మార్కెట్‌ పుంజుకుంటుంది. అయితే మా వద్ద పిల్లల కోసం తగినంత ఆడియో ప్లాట్‌ఫారమ్‌లు గానీ కంటెంట్‌ గానీ లేవు. ఈ రకమైన ఆడియో కంటెంట్‌ యుఎస్‌లో ప్రజాదరణ పొందుతోంది. దాన్ని మన దేశంలోకి తీసుకురావాలని అనుకున్నాము. భారతదేశం, సింగపూర్‌కు చెందిన కుటుంబ సభ్యులు, స్నేహితుల నుండి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ మాకు చాలా సహాయపడింది అని నేహా వివరించారు.
ఆరు నెలలు ఉచితం
ప్రస్తుతం కంపెనీ రూ. 3,500 విలువైన స్టార్టర్‌ ప్యాక్‌ను అందిస్తుంది. ఇందులో ఆరు నెలల ఉచిత ఆడియో కంటెంట్‌తో పేరెంట్‌ నియంత్రిత యాప్‌, సురక్షితంగా వినడం కోసం 90 సదీ క్యాప్‌ చేయబడిన వాల్యూమ్‌ లిమిటర్‌లతో కూడిన పిల్లలకు అనుకూలంగా ఉండే హెడ్‌ఫోన్‌లు, రెండు యాక్టివిటీ పుస్తకాలు ఉంటాయి. Vobbleరీవ త్వరలో తక్కువ ధరతో మూడు నెలల సబ్‌స్క్రిప్షన్‌ ప్యాక్‌తో రాబోతుందని నేహా పంచుకున్నారు. అధిక ధరపై సందేహం వ్యక్తం చేసిన కౌర్‌ గత రెండు నెలలుగా వీటిని ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు ఇది డబ్బు కన్నా విలువైనదని గుర్తించారు. ప్రస్తుతానికి Vobbleరీవ బ్లూమ్‌ ఫౌండర్స్‌ ఫండ్‌, యుఎస్‌, భారతదేశానికి చెందిన టెక్‌ ఏంజెల్‌ వ్యవస్థాపకులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల నుండి 400,000 డాలర్లను సేకరించింది. ప్రస్తుతం కంపెనీ స్టార్టర్‌ ప్యాక్‌ను అంది స్తోంది. ఇందులో 200 మంది సభ్యులు ఉన్నారు. అయితే రాబోయే నెలల్లో సాధారణ సబ్‌స్క్రిప్షన్‌లు, బాక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌లు రెండింటినీ ప్రవేశపెట్టాలని వ్యవస్థాపకులు ప్లాన్‌ చేస్తున్నారు. తమ బాక్స్‌ను 10,000 మందికి విక్రయించాలని, 2024 చివరి నాటికి లక్ష కంటే ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్‌ బేస్‌ను పొందాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ‘సజనాత్మకతను పెంపొందించడం, ఉత్సుకతను రేకెత్తించడం ద్వారా పిల్లల స్క్రీన్‌ సమయాన్ని తగ్గించడానికి ఆడియో కంటెంట్‌ విలువైన పరిష్కారాన్ని ఇది అందిస్తుంది. దీనికోసం Vobbleవ కచ్చితమైన లక్ష్యంగా పెట్టుకుంది’ నేహా జతచేస్తున్నారు.
మా ఆసక్తులు ఒకటే
వోబుల్‌ 2023 ఆగస్టులో డబ్బు సంపాదించడం ప్రారంభించింది. వారి భర్తలు ఇద్దరూ వ్యాపారవేత్తలు కాబట్టి వారి నుండి కొన్ని నైపుణ్యాలను నేర్చుకున్నారు. ‘మా ఇద్దరికీ ఒకే విధమైన ఆసక్తులు ఉన్నాయి. కానీ మా నైపుణ్యం, స్వభావం కాస్త భిన్నంగా ఉంటాయి. నేను ఆపరేషన్‌, మార్కెటింగ్‌, ఫైనాన్స్‌ను నిర్వహిస్తాను. సౌమ్య కంటెంట్‌ సష్టి, ఉత్పత్తితో సహా సజనాత్మక భాగాలను చూసుకుంటుంది. ఇలా మేమిద్దరం కలిసి మనసు పెట్టి ఈ వ్యాపారం ప్రారంభించాం’ అంటూ నేహా తన మాటలు ముగించారు.