
నవతెలంగాణ-బెజ్జంకి
బ్రిటిష్ పరిపాలనలో అణచివేతకు గురైన భారత దేశ పునః నిర్మాణంలో తొలి ప్రధాని పడిట్ జవహర్ లాల్ నెహ్రు కీలక పాత్ర పోషించారని ఏఎంసీ చైర్మన్ పులి క్రిష్ణ కొనియాడారు. గురువారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డి అధ్వర్యంలో మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రు జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాయకులు శానగొండ శ్రవణ్, రొడ్డ మల్లేశం, లింగాల శ్రీనివాస్, జెల్ల ప్రభాకర్, కత్తి రమేశ్, లింగాల బాబు తదితరులు పాల్గొన్నారు.