నెహ్రూ యువ బ్లాక్ లెవెల్ క్రీడా పోటీలు

నవతెలంగాణ -మహాముత్తారం 
క్రీడలు మానసిక ఉల్లాసానికి ఉత్సాహానికి దోహదపడతాయని నెహ్రు యువ కేంద్ర యూత్   కోఆర్డినేటర్ జాటోత్ నవీన్ కుమార్ అన్నారు. శనివారం మహాముత్తారం మండలంలోనిమోడల్ స్కూల్, జూనియర్ కాలేజ్  క్రీడా మైదానం లో నెహ్రూ యువ కేంద్ర యూత్ కోఆర్డినేటర్ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో  కబడ్డీ, వాలీబాల్, కోకో, రన్నింగ్  క్రీడలు నిర్వహించి గెలిచిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గెలుపోటములు సహజమని, ఓడినవారు కృంగిపోకుండా మళ్ళీ   గెలుపు కోసం ప్రయత్నం చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాలేజి ప్రిన్సిపాల్ ఆలోత్ రాజు,  బానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.