నెహ్రూ చేసిన సేవలు మర్చిపోలేనివి..

Nehru's services are unforgettable.నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
దేశ మొట్టమొదటి ప్రధానిగా పనిచేసిన మహనీయులు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ సేవలను భారత జాతి ఎన్నడూ మరిచిపోలేదని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. గురువారం నెహ్రు జయంతి, బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డు వద్ద గల చాచా నెహ్రు విగ్రహానికి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ స్వతంత్ర భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ  జయంతిని నవంబర్ 14న భారతదేశమంతటా బాలల దినోత్సవంగా జరుపుకుంటామని గుర్తు చేసారు. నేటి బాలలే రేపటి పౌరులని గుర్తు చేసేదే బాలల దినోత్సవమని అన్నారు. పెద్దలు వారి పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేందుకు తమవంతు సహాయాన్ని అందించాలని అన్నారు. ప్రభుత్వం బాలల అభివృద్ధికి, విద్యార్థులకు అన్ని అవకాశలు కల్పిస్తూ గురుకులాలు ఏర్పాటు చేస్తోందని అన్నారు.  కార్యక్రమంలో మావల మండల అధ్యక్షులు ధర్మపురి చంద్రశేఖర్, మాజీ వైస్ ఎంపీపీ అట్ల గోవర్ధన్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్  కుదురుపాక సురేష్, మాజీ కో ఆప్షన్ మెంబర్ రహీమ్ ఖాన్, యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు, నాయకులు ఉన్నారు.