
కుంట్లగూడెం గ్రామపంచాయతీ పాలకవర్గం వీడ్కోలు కార్యక్రమం బుధవారం నిర్వహించారు. గత 5 సంవత్సరాలుగా గ్రామానికి చేసిన సేవలు కొనియాడారు. నేలపట్ల ఎంపీటీసీ సభ్యురాలు తడక పారిజాతమోహన్ మాట్లాడుతూ.. పదవీ విరమణ పదవికి కానీ సేవకు కాదు అని అన్నారు. ఈ కార్యక్రమంలో కుంట్లగూడెం గ్రామపంచాయతీ స్పెషల్ ఆఫీసర్ పృథ్వి ముఖ్యఅ తిథిగా పాల్గొన్నారు. నేలపట్ల ఎంపీటీసీ తడక పారిజాతమోహన్ పాలకవర్గ సభ్యులకు సన్మానం చేయడం జరిగింది. గ్రామపంచాయతీ కార్యదర్శి కిరణ్ గ్రామ పంచాయతీ తరపున మాజీ సభ్యులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయ తీ మాజీ సర్పంచ్ మిర్యాల పారిజాతగోపాల్ మాజీ ఉపసర్పంచ్ జంగిలి మహేష్ మాజీ వార్డు సభ్యులు కొండ రమేష్,లింగస్వామి, వల్లకాటి రమ్యఅనిల్ కుమార్,ఈపూరి కల్పనశేఖర్,బొమ్మిరెడ్డి సుగుణ రవీందర్ రెడ్డి,గంగదేవి పెంటమ్మ నరసింహ కో ఆప్షన్ సభ్యులు గ్రామపంచాయతీ సిబ్బంది గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.