అంగన్ వాడి పిల్లలకు పౌష్టికాహారం అందించిన నెమలి ఉదయ్ మెమోరియల్ ట్రస్ట్

Nemali Uday Memorial Trust provided nutritious food to Angan Wadi childrenనవతెలంగాణ – గోవిందరావుపేట
మండల కేంద్రానికి చెందిన దండోరా జాతీయ నాయకులు నెమలి నర్సయ్య కుమారుడు కీర్తిశేషులు నెమలి ఉదయ్ సాయికుమార్ జయంతి కార్యక్రమాన్ని సోమవారం మండలం కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో  నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా  ప్రభుత్వ అధికారిక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు జన్ను రవి హాజరై మాట్లాడుతూ అత్యంత పేదరికంలో జన్మించిన నెమలి నర్సయ్యమాదిగ పిల్లలను ఉన్నత విద్యావంతులుగా ఉన్నత ఉద్యోగులుగా తీర్చిదిద్దాలని లక్ష్యంతో  నెమలి ఉదయ్ సాయి దేశ రాజధాని  డిల్లి లో కేంద్ర ప్రభుత్వ సర్వీస్ లో  కేంద్ర హోం అఫైర్స్ డిపార్ట్మెంట్  లో సెంట్రల్ బీసీ వెల్ఫేర్ కమిషన్ ఉద్యోగం చేసేవాడని అంత పెద్ద స్థాయిలో ఉద్యోగం చేస్తూ అనతి కాలంలో మరణించడం ఆ కుటుంబానికి తీరని లోటని ఉదయ్ నెమలి ని ఆదర్శంగా తీసుకొని నేటి యువతీ యువకులు గొప్ప చదువులు చదివి కులము వర్గము మతం అనే తేడా లేకుండా దేశం కోసం పేద ప్రజల కోసం పాటుపడాలనిపిలుపునిచ్చారు.నేడు నెమలి ఉదయ్  మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో  గోవిందరావు పేట  గ్రామంలోని మొత్తం ఆంగన్ వాడి సెంటర్ లోని పిల్లలకు పౌష్టికాహారం అందించడం, చాలా గొప్ప విషయమని ఉదయ్ లేని లోటును పూడ్చలేకున్నా ఆ కుటుంబానికి మా వంతు సహకారం తప్పనిసరిగా ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం నెమలి ఉదయ్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ సాఫ్ట్వేర్ ఉద్యోగి నెమలి భావన అంగన్ వాడి పిల్లలకు పౌష్టికాహారం అందించారు. ఈ కార్యక్రమంలో  సమగ్ర శిశు సంరక్షణ పథకం  మండల సూపర్ వైజర్ తులసి అనంత లక్ష్మీ  స్థానిక ప్రధానోపాధ్యాయులు కొర్ర రఘు రామ్, పి ఏ సి ఎస్ డైరెక్టర్ జెట్టి సోమయ్య, మహాజన సోషలిస్టు పార్టీ రాష్ట్ర నాయకులు వావిలాల స్వామీ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కనతల నాగేందర్ రావు జిల్లా అధికార ప్రతినిధి జంపాల శేఖర్ మహాజన్, జిల్లా  కార్యదర్శి,గణపాక సుధాకర్   తల్లిదండ్రులు నెమలి నర్సయ్య, స్వరూప,  డాక్టర్ నెమలి గాంధీ దళిత నాయకులు మునగాల వెంకన్న , సన్నగుండ్ల వెంకన్న, ఎం ఆర్ పి ఎస్  గ్రామ కమిటీ అధ్యక్షులు, జంగిడీ ప్రకాశ్ ,నెమలి బాలకృష్ణ,,నెమలి సాయిప్రసన్న, పాఠశాల,మరియు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.